అగ్ర రాజ్యంలో గంటల పాటు హై టెన్షన్...ఉగ్రవాదిని విడిపించాలని డిమాండ్...

అగ్ర రాజ్యం అమెరికా కొన్ని గంటల పాటు ఊపిరి బిగపట్టుకుని ఉంది.మారణాయుధాలతో ఓ దుండగుడు అమెరికాలోని ఓ చర్చిలోకి ప్రవేశించి ఐదు గురిని అదుపులోకి తీసుకుని చేసిన వీరంగంతో అక్కడి పోలీసు యంత్రాంగానికి ఏం చేయాలో కూడా పాలుపోలేదు.

 Texas Synagogue Attack: Fbi Storms Building To Release Hostages, Gunman Dead,fbi-TeluguStop.com

ఈ పరిస్థితిపై అధ్యక్షుడు బిడెన్ సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.చివరిగా FBI తెలివితేటలతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి దుండగుడి చెర నుంచీ పౌరులను విడిపించాయి.

ఇంతకీ అతడు ఎందుకు అలా చేశాడు.అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.

నిన్నటి రోజున టెక్సాస్ రాష్ట్రంలో యూదుల ప్రార్ధనా మందిరంలోకి పేలుడు పదార్ధాలతో,తుపాకులతో వెళ్ళిన దుండగుడు అక్కడి మతగురువును, మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాడు.ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఓ వీడియోని విడుదల చేశాడు.

అమెరికాలో జైల్లో మగ్గుతున్న పాక్ మహిళా ఉగ్రవాది ఆఫియా సిద్దికీని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశాడు.దాంతో ఒక్కసారిగా అమెరికాలో హై టెన్షన్ మొదలయ్యింది.దుండగుడు అదుపులోకి తీసుకున్న వారిపై ఎలాంటి దారుణానికి పాల్పడుతాడోనని ఆందోళనలు కలిగాయి.ఈ క్రమంలో

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారులతో చర్చించారు.బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు.దాంతో రంగంలోకి దిగిన FBI దుండగుడితో చర్చలు జరిపి బందీలను ఒక్కొక్కరిగా విడిపించింది.

FBI కి తోడుగా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి, దుండగుడి వద్ద ఎలాంటి పేలుడు పదార్ధాలు ఉన్నాయి, అవి పేలితే ఎలాంటి నష్టం జరుగుతుందో అంచనా వేశారు.అందరూ బయటకు వచ్చిన తరువాత దుండగుడిపై గుళ్ళ వర్షం కురిపించారు.

అయితే సుమారు 10 గంటల పాటు నరాలు తెగిపోతాయా అనేంత ఉత్ఖంట మధ్య ఎట్టకేలకు అధికారులు సురక్షితంగా పౌరులను విడిపించారు.

Texas Synagogue Attack: FBI Storms Building To Release Hostages, Gunman Dead,FBI, Texas Attack, America, US President Joe Biden, US Army Officers, Afghanistan,Texas Synagogue - Telugu Afghanistan, America, Texas Attack, Texas Synagogue, Officers, Joe Biden

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube