ఓ వైపు కోవిడ్‌తో బైడెన్ యుద్ధం .. టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం, ఇకపై..!!

Texas Governor Lifts Mask Mandate Opening State 100 Percent

కరోనా వల్ల ప్రపంచంలోనే ఎక్కువ ప్రభావితమైన దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధం చేస్తున్నారు.100 రోజుల ప్రణాళిక పేరిట ఆ మహమ్మారిని దేశంలో లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఆర్ధిక వ్యవస్ధను పట్టాలెక్కించాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెరదీశారు.ఆయన స్పీడుతో అమెరికా టీకా పంపిణీలో 50 మిలియన్ల మైలురాయిని చేరుకుంది.దీనిని ఇంకా పెంచేందుకు గాను బైడెన్ యంత్రాంగం జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.

 Texas Governor Lifts Mask Mandate Opening State 100 Percent-TeluguStop.com

అలాగే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.2.5 కోట్లకు పైగా మాస్కులను పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.కొవిడ్‌పై పోరులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌస్ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికీ పేద అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.మార్చి నుంచి మే మధ్య కాలంలో దేశంలోని 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 60,000 ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో మాస్కుల పంపిణీ చేస్తామని వైట్‌హౌస్ తెలిపింది.

 Texas Governor Lifts Mask Mandate Opening State 100 Percent-ఓ వైపు కోవిడ్‌తో బైడెన్ యుద్ధం .. టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం, ఇకపై..-Latest News English-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బైడెన్ ఇలాంటి చర్యల్లో ఉండగానే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్‌ అబోట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర ప్రజలు ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదన్నారు.

అలాగే నూరు శాతం వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన అనుమతించారు.ఈ నిర్ణయం ద్వారామాస్క్‌ ధరించడం తప్పనిసరి నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేసిన తొలి రాష్ట్రంగా టెక్సాస్ నిలవనుంది.

కరోనా కారణంగా టెక్సాస్‌ పౌరులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితికి ముగింపు పలికేలా నూరు శాతం వాణిజ్య కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు అబోట్ పేర్కొన్నారు.

Telugu Abbott, America, Biden, Corona, Governor Texas-Movie-English

ప్రస్తుతం దేశంలో కరోనా టీకాలు, మెరుగైన పరీక్షలు, చికిత్సా విధానం అందుబాటులోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ స్పష్టం చేశారు.ఈ మహమ్మారి ధాటికి టెక్సాస్‌లో దాదాపు 42వేల మందికి పైగా మరణించారు.ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను అబోట్ గతేడాది జూలైలో అందరికీ మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.అప్పట్లో ఆయన నిర్ణయం పట్ల సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఉద్ధృతంగా వున్న వేళ మాస్క్‌లు ధరించడంపై మరోసారి సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

#Abbott #Corona #America #Biden #Governor Texas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube