పవన్‌ లాయర్‌ సాబ్‌ : అయ్యో అది ఉతుత్తి చిత్రీకరణట  

Test Shoot For Pawan Kalyan Movie-pawan Kalyan,pink Remake

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ చిత్రం ఇటీవల మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.కొన్ని ఫొటోలు మరియు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Test Shoot For Pawan Kalyan Movie-Pawan Pink Remake

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నట్లుగా ప్రచారం జరిగింది.అయితే ఆ రోజు షూటింగ్‌ జరిగిన మాట వాస్తవం.

అందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నది కూడా వాస్తవం.అది పింక్‌ రీమేక్‌ అనేది కూడా నిజమే.కాని అదంతా కూడా ఉత్తినే చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.
ఏదైనా షూటింగ్‌ ప్రారంభంకు ముందు రెండు మూడు రోజుల పాటు టెస్టు షూట్‌ చేసి దాన్ని చూసుకున్న తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తారు.

అన్ని విధాలుగా పాత్రలకు వారు సెట్‌ అవుతున్నారా లేదా అనే విషయాలను చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ధారించుకునేందుకు ఈ ఉత్తుత్తి షూట్‌ అంటే టెస్టు షూట్‌ను నిర్వహిస్తారు.అదే ఇటీవల జరిగింది.పవన్‌ కళ్యాణ్‌ తో పాటు పలువురు నటీనటులపై కూడా ఈ షూట్‌ జరిగింది.

షూట్‌ ఫలితం వచ్చింది అన్ని విధాలుగా దర్శకుడు మరియు నిర్మాత సంతృప్తి చెందడటంతో పవన్‌ కళ్యాణ్‌ డేట్ల కోసం యూనిట్‌ సభ్యులు వెయిట్‌ చేస్తున్నారు.ప్రస్తుతం పవన్‌ కాస్త హడావుడిగా ఉన్న కారణంగా వచ్చే నెలలో షూటింగ్‌ ను ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్‌ ఈ ఫొటోలు వీడియోలు లీక్‌ అవ్వడంపై యూనిట్‌ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

దాంతో తర్వాత ఒరిజినల్‌ కంటెంట్‌ లీక్‌ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారట.

తాజా వార్తలు

Test Shoot For Pawan Kalyan Movie-pawan Kalyan,pink Remake Related....