ట్రంప్ కుమారుడికి కూడా కరోనా సోకిందిగా...!!!

కరోన మహమ్మారి అమెరికా వ్యాప్తంగా సృష్టిస్తున్న అలజడి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేస్తూ కులం మతం, ప్రాంతం,ఇలాంటి భేదాలు లేకుండా అందరిని టచ్ చేసి వెళ్తోంది.చివరికి

 Test Positive Trump Son Barren Trump Coronavirus, Donadl Trump, Barren Trump, Mo-TeluguStop.com

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలనియా ట్రంప్ కి కూడా సోకింది.

ట్రంప్ ఆయన సతీమణి ఈ హమ్మారి నుంచీ కోలుకోగా తాజాగా ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్ కి కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.

Telugu @realdonaldtrump, Barren Trump, Coronavirus, Donadl Trump, Molania-Telugu

తమ కుమారుడు బారెన్ ట్రంప్ కి కరోన సోకినట్టుగా తల్లి మెలానియా ట్రంప్ వెల్లడించారు.తమకి కరోనా సోకినా నాటి నుంచీ బారెన్ దూరంగా ఉంటున్నాడని, ఎప్పటికప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని చాలా సార్లు నెగిటివ్ అని వచ్చినా తాజాగా పాజిటివ్ గా నమోదు అయ్యిందని తెలిపారు.అయితే ఈ వైరస్ బారిన పడినా ఇప్పటి వరకూ ఎలాంటి లక్షణాలు కనపడలేదని ఆమె తెలిపారు.

తమకి కరోనా సోకిన రోజు నుంచీ ఎంతో ధృడంగా ఉన్నామని ఎక్కడా కూడా మనో ధైర్యం కోల్పోలేదని మెలానియా ప్రకటించారు.

కరోనా బారిన పడతామని అస్సలు ఊహించలేదని తమ అదృష్టం ఏమిటంటే మేము చిన్న చిన్న లక్షణాలతో వ్యాధి ముదరకుండానే బయటపడ్దామని, అప్పటి పరిస్థితి ఇప్పుడు ఊహించుకుంటేనే భయం పుట్టుకొస్తుందని వ్యాధిని జయించడానికి మాతో పాటు వైద్యులు కూడా ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానని మెలానియా అన్నారు.

త్వరలో కుమారుడు బారెన్ కూడా పూర్తి ఆరోగ్యవంతంగా బయటకు వస్తాడని మెలానియా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube