మీ ఫోన్ లో టచ్ స్క్రీన్ సరిగా పని చేస్తుందో లేదో ఇలా కాలిబర్ చేసుకోండి…!  

How to Test Mobile Touch Screen Working or Not, new mobile, screen touch, hardware service, google play store, touch screen test - Telugu Google Play Store, Hardware Service, How To Test Mobile Touch Screen Working Or Not, New Mobile, Screen Touch, Touch Screen Test

ప్రపంచంలో రోజుకు ఒక కొత్త మోడల్ ఫోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది.దీంతో ఒక ఫోన్ బాగా నచ్చింది అనుకునేలోపే మరిన్ని కొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది.

TeluguStop.com - Test Mobile Touch Screen App

అయితే ఎన్ని మొబైల్స్ వచ్చినా, ఒక సంవత్సరం లేదా ఆపై కొద్ది రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటాయి.ఇందులో ముఖ్యంగా టచ్ స్క్రీన్ విషయంలో అనేక సమస్యలు మనకు కనబడుతూనే ఉంటాయి.

వీటి ద్వారా ఫోన్ వాడే సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.అయితే, ఈ ప్రాబ్లం నుండి దూరం కావడానికి కేవలం స్క్రీన్ మార్చడం మాత్రమే కాకుండా కొన్ని పద్ధతులను ఫాలో అవడం ద్వారా వాటి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లభిస్తుంది.

TeluguStop.com - మీ ఫోన్ లో టచ్ స్క్రీన్ సరిగా పని చేస్తుందో లేదో ఇలా కాలిబర్ చేసుకోండి…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అది ఎలానో ఓసారి చూద్దామా…

ఇదివరకు రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే చాలా ఎక్కువగా టచ్ స్క్రీన్ సంబంధించి ఇబ్బందు వచ్చేవి.అయితే ఈ మధ్యకాలంలో ఈ విషయం పరంగా కాస్త మొబైల్ కంపెనీలు కాస్త పురోగతి సాధించినట్లు కనబడుతున్నాయి.

మామూలుగా మీ ఫోన్ సరిగ్గా రెస్పాండ్ కాకపోతే దాన్ని సర్వీస్ సెంటర్ కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము.అక్కడికి తీసుకోక పోకముందే మనమే ఫోన్ లో ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందో క్లారిఫై చేసుకొని అందుకు సంబంధించి రిపేర్ చేపించుకొనే అవకాశం ఉంది.

మామూలుగా కొన్ని సందర్భాల్లో టచ్ స్క్రీన్ సెన్సిటివిటీ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి.మామూలుగా స్క్రీన్ పైన గీతలు పడకుండా ఉండేందుకు స్క్రీన్ ప్రొటెక్టర్ వేసినప్పుడు మొబైల్ స్క్రీన్ ఇదివరకు కంటే కాస్త ఎక్కువగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు.

ఇక ఇలాంటి సమయంలో మన ఫోన్ లో ఉండే టచ్ స్క్రీన్ సెన్సిటివిటీ కాస్త అడ్జస్ట్ చేసుకుంటే ఇది వరకు ఉన్న సెన్సిటివిటీని మనం పొందవచ్చు.

ఇక అలాగే కొంతమందికి ఫోన్స్ అనుకోకుండా డ్యామేజ్ అవ్వడంలో స్క్రీన్ దెబ్బతిని ఉండవచ్చు.

ఇక అలాంటి సమయంలో కూడా స్క్రీన్ ఎక్కువగా రెస్పాన్స్ కాకుండా ఉండవచ్చు.అయితే ఇందుకోసం మనకు గూగుల్ ప్లే స్టోర్ లో లభించే టచ్ స్క్రీన్ టెస్ట్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ద్వారా మన మొబైల్ లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో స్క్రీన్ రెస్పాన్స్ రేట్ ఎలా ఉందో ప్రతి పాయింట్ దగ్గర పరిశీలిస్తూ ఉంటుంది.ఒకవేళ మీ ఫోన్ కు సంబంధించి స్క్రీన్ ఎక్కడైనా సమస్య ఉంది అంటే ఆ అప్లికేషన్ అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ స్క్రీన్ మీద చూపిస్తుంది.

ఈ విధంగా చేసినా కూడా మీ ఫోన్ టచ్ స్క్రీన్ రెస్పాన్స్ తక్కువగా ఉందంటే మొబైల్ హార్డ్వేర్ సర్వీస్ సెంటర్ కు తీసుకు వెళ్లడం ఎంతో శ్రేయస్కరం.

#HowTo #New Mobile #Screen Touch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Test Mobile Touch Screen App Related Telugu News,Photos/Pics,Images..