బెంగళూరులో టెస్లా ప్లాంట్.. ఎలన్ మస్క్‌కు గట్టి ఎదురు దెబ్బ, ప్రోత్సాహకాలపై భారత్ కీలక ప్రకటన

టెస్లాను భారత్‌లో విడుదల చేయడానికి అక్కడి దిగుమతి సుంకాలు ప్రతిబంధకంగా వున్నాయంటూ స్వయంగా ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.భారత్‌లో టెస్లా లాంచింగ్‌కు సంబంధించి ఇటీవల టర్‌లో ఎలాన్‌ మస్క్‌ను ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.

 Tesla Ceo Elon Musk Indian Govt Says No Specific Incentives And Import Duties-TeluguStop.com

భారత్‌లో వీలైనంత త్వరగా టెస్లా కార్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు.దీనికి మస్క్‌ స్పందిస్తూ.

జాప్యానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇండియాలో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని.

 Tesla Ceo Elon Musk Indian Govt Says No Specific Incentives And Import Duties-బెంగళూరులో టెస్లా ప్లాంట్.. ఎలన్ మస్క్‌కు గట్టి ఎదురు దెబ్బ, ప్రోత్సాహకాలపై భారత్ కీలక ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వచ్ఛ ఇంధన వాహనాలను సైతం పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్ల వాహనాల వలే పరిగణిస్తున్నారంటూ ఎలన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు.అయితే, త్వరలో విద్యుత్తు వాహనాలపై కనీసం తాత్కాలిక ఉపశమనమైనా కల్పిస్తారని ఆశిస్తున్నాం అని మస్క్‌ సదరు నెటిజన్‌కి రిప్లై ఇచ్చాడు.

అయితే మస్క్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ టెస్లాకు ఎలాంటి రాయితీలు వుండవని భారత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.భారత్‌లో టెస్లాకు కంపెనీ సంబంధిత ప్రోత్సహకాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

అంతేకాదు దిగుమతి సుంకంపైనా ఈ సంస్థకు ఎలాంటి రాయితీలు ఉండవని, సమీప భవిష్యత్తులో కూడా వాటిలో మార్పు వుండదని భారత ప్రభుత్వం తెలిపినట్లుగా కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దేశంలో ఇప్పటికే ఈ-వెహికిల్స్‌ మీద సెక్టోరల్‌ ఇన్‌సెంటివ్స్‌.అది కూడా స్థానిక తయారీదారులకే వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 30 లక్షల కంటే విలువైన వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని భారత్ విధిస్తోంది.

దీంతో రీజనబుల్‌ ధరలతో టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది.ఇక టెస్లా మెయిన్‌ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది.

ఈ ఏడాది భారత్‌లో అమ్మకాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా… అన్ని మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసింది.పూర్తి అసెంబ్లీంగ్ జరిగిన కార్లపై 40 శాతం మేర పన్నులు తగ్గించాలని కోరింది.40 శాతం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైన ధరకు రాగలవని మస్క్ అభిప్రాయపడుతున్నారు.కానీ ఈ లేఖలపై నీతి ఆయోగ్ కానీ, రవాణా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు స్పందించలేదు.

ఇలాంటి పరిస్దితుల్లో ప్రభుత్వ వర్గాల నుంచి ఈ తరహా సంకేతాలు రావడం ఎలన్ మస్క్‌కి ఊహించని షాకేనని కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

#TelsaCEO #Duty Relaxation #BigShock #PM Modi #TemporaryRelief

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు