సెకనుకు మూడు కోట్ల సంపాదన.. ఎవరికో తెలుసా..?!

గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఈయన ఒకరు.

 Tesla Ceo Elon Musk Earns Three Crores For Every Second-TeluguStop.com

అయితే మస్క్ సెకనుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా.? వింటే ఆశ్చర్య పోక తప్పదు.ఎలన్ మస్క్ ప్రతి సెకనుకు దాదాపు మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.అంతేకాదండోయ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తో పాటు అంతరిక్ష యానానికి స్పేస్ ఎక్స్ కంపెనీలతో రికార్డులు నెలకొల్పుతున్నారు.

దీంతో మస్క్ సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉండడం విశేషం.అయితే సోమవారం ఒక్కరోజే ఆయన సంపాదన 36.2 బిలియన్ డాలర్లు పెరిగింది.అంటే మన కరెన్సీలో ఎలన్ మస్క్ సంపాదన రూ.2.71 లక్షల కోట్లు అన్నమాట.అంటే సెకనుకు 3 కోట్ల రూపాయలు ఆయన సంపాదిస్తున్నారు.

 Tesla Ceo Elon Musk Earns Three Crores For Every Second-సెకనుకు మూడు కోట్ల సంపాదన.. ఎవరికో తెలుసా..-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి తోడు హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ లక్ష టెస్లా కార్లు కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడంతో ఈ సంస్థ షేర్ పైపైకి దూసుకెళ్లింది.సోమవారం ఒక్క రోజే టెస్లా స్క్రిప్ట్ విలువ 14.9% పెరిగి 1,045.02 దాలర్లకు చేరుకుంది.స్టాక్ మార్కెట్లలో ఎలన్ మస్క్ నికర సంపద 36.2 బిలియన్ డాలర్లుగా పెరిగింది.దీంతో మొత్తం సంపద 288.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Telugu 3 Crores Income, 36.2 Billion Dollars, Amazon, Apple, Bloomberg, Earns Three Crores For Every Second, Elan Mask, Electric Cars, Google, Latest News, Microsoft, Second, Space X, Tesla, Tesla Ceo Elon Musk-General-Telugu

2021సంవత్సరంలో ఇప్పటివరకూ ఎలన్ మస్క్ సంపద విలువ దాదాపు 119 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.ఇంకా టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది.ఆపిల్, అమెజాన్, సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ , గూగుల్ ఆల్ఫాబెట్ సరసన వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీగా టెస్లా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

#Electric Cars #Bloomberg #Earns #Google #Space

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube