గంటకు 140 కి.మీ. వేగంతో వెళ్తున్న కారులో పడుకున్న డ్రైవర్... చివరకు ఏమైందంటే..?

ప్ర‌ముఖ కార్ల త‌యారీ కంపెనీ టెస్లా గురించి అందరికీ తెలిసినదే.మొదటి సారిగా కార్ల‌లో ‘ఆటో పైల‌ట్’ మోడ్ ని ప్రవేశ పెట్టింది ఈ కంపెనీనే.

 Man Falls Asleep In Tesla Self-driving Car At 140 Kmph, Tesla Self-driving Car,1-TeluguStop.com

ఇంతకీ ఆటో పైల‌ట్ మోడ్ అంటే ఏమిటో తెలుసా…? డ్రైవ‌ర్ అవసరం లేకుండానే ఆటో పైల‌ట్ మోడ్‌లో కార్ దానంత‌ట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పోతుంది.యాక్స‌ల‌రేట‌ర్ ‌ను అప్లై చేస్తూ ఆటో మేటిగ్గా బ్రేక్‌లు వేస్తుంది.

కేవలం ఈ ఫీచ‌ర్ల కోస‌మే బడాబాబులు టెస్లా కార్ల‌ను కొంటుంటారు.అక్టోబరు 2015 లో టెస్లా ఈ ఫీచర్ ను ప్రవేశ పెట్టింది.

అయితే అప్పట్లో ఇది పూర్తిగా సురక్షితం కాదని కొందరు నిపుణులు సూచించడంతో మరికొన్ని మార్పులను చేసి, మరింత అభివృద్ధి చేసారు.దాదాపుగా ఈ ఫీచర్ ఇపుడు సక్సెస్ ఫుల్ గానే నడుస్తుందని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళితే… దీన్ని అదునుగా తీసుకున్న ఓ టెస్లా కారు డ్రైవ‌ర్ కారును ఆటో పైలట్ మోడ్ లో పెట్టి గురక నిద్ర‌పోయాడు.

కారు గంట‌కు 140 కి.మీ.వేగంతో రోడ్డుపైన దూసుకు వెళ్లడంతో పోలీసులు కారును ఆపి సదరు వ్య‌క్తిని అరెస్టు చేశారు.ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే.కెన‌డాలోని ఆల్బ‌ర్టా ప్రావిన్స్ ‌లో ఉన్న పొనొకా అనే టౌన్ వ‌ద్ద ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.టెస్లా కారులో ఉన్న ఆటో పైల‌ట్ మోడ్ ‌ను అతగాడు ఆన్ లో ఉంచి, నిద్రలోకి జారుకున్నాడు.త‌రువాత కారు గంట‌కు 140 కిలో మీట‌ర్ల వేగానికి చేరుకొని దూసుకుపోయింది.

అయితే.ఆ రహదారిలో ప్ర‌యాణించాల్సిన గ‌రిష్ట వేగం గంట‌కు 110 కిలోమీట‌ర్లు మాత్ర‌మే.అందువ‌ల్ల ఓవ‌ర్ స్పీడ్‌ తో వెళ్లినందుకు ఆ డ్రైవ‌ర్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.మ‌న దేశంలో అయితే ఓవ‌ర్ స్పీడ్‌ కు జ‌రిమానా విధించి వదిలేస్తారు.

కానీ కెన‌డాలో అలా కాదు.తాట తీసేస్తారు.

అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ ‌పెట్టి, 3 నెలలు జైలు శిక్ష విధించారు.అంతటితో ఆగకుండా అతని లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube