దేవుడా: ఒకేసారి 200 మంది స్టూడెంట్స్ ను కిడ్నాప్ చేసిన ముష్కరులు.. ఎక్కడంటే..?!

నైజీరియా దేశంలో స్కూల్ విద్యార్థులు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది.అక్కడ రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి.

 Terrorists Kidnap 200 Students In Nigeria , Niziriya, Students, Kidnapers, Kinda-TeluguStop.com

ఆ దేశంలో ముష్క‌ర గ్రూపులు డ‌బ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నాయి.ముష్క‌రుల దాడులు మరీ కిరాత‌కంగా ఉంటున్నాయి.

ఆ దేశంలో ఇప్ప‌టికే ఎంతో మంది చిన్నారులు ముష్కరుల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ముష్క‌ర గ్రూపులు ఇప్పుడు మ‌రో దారుణానికి ఒడిగట్టాయి.

వారు చేసిన పనికి ఆ దేశం ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డింది.ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.

నైజీరియాలోని ఒక పాఠశాలపై ముష్క‌రులు దాడి చేశారు.జాలి, దయ అనేవి లేకుండా దాదాపు 200 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు.కేంద్ర రాష్ట్రమైన నైజర్‌ లోని తెగినాలో ఓ ఇస్లామిక్ స్కూల్‌ పై ఈ దాడి జరిగింది.ఈ దాడిలో దాదాపు 200 మంది విద్యార్థులు కిడ్నాప్ కి గురయ్యారు.

ఆ ముష్క‌ర గ్రూపులు తుపాకుల‌తో వచ్చి ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులపై దాడి చేసినట్లు తెలిసింది.

Telugu Languages, Africa, Drugs, Kidnapers, Kindapped, Niger, Nigeria, Niziriya,

ఈ దాడి ఘటనలో ఒకరు మృతిచెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ వివరాలన్నీ అక్క‌డ పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు.

కిడ్నాప్ అయిన చిన్నారుల కోసం అక్కడి పోలీసులు రంగంలోకి దిగి గాలించడం మొదలెట్టారు.

నైజీరియాలో విద్యావిధానాన్ని అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

ప్రాంతీయ స్థాయిలో స్థానిక అధికారులు ప్రభుత్వ-నియంత్రిత విద్య, రాష్ట్ర పాఠశాలల విద్యస్ విధానం అమలు చేసే బాధ్యతను స్థానిక అధికారులు తీసుకుంటారు.నైజీరియాలో 521 భాషలు వాడుకలో ఉన్నాయి.

నైజీరియాలో 250 కంటే ఎక్కువ జాతి సమూహాలు ఉన్నాయి.నైజీరియా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది.

Telugu Languages, Africa, Drugs, Kidnapers, Kindapped, Niger, Nigeria, Niziriya,

2017 నాటికి ఆఫ్రికా ఖండంలోని మొత్తం జనాభాలో 17% వరకు నైజీరియాలోనే ఉండటం విశేషం.నైజీరియా దేశం ముఖ్యంగా మాదకద్రవ్య అక్రమ రవాణాలో చురుకుగా ఉంటుంది.నైజీరియా నేర సమూహాలు డ్రగ్స్ అక్రమ రవాణాలో ఆసియా దేశాల నుండి హెరాయిను ఐరోపా, అమెరికాకు రవాణా చేయడంలో ఎక్కువగా పాల్గొంటాయి దక్షిణ అమెరికా నుండి కొకైను ఐరోపా, దక్షిణాఫ్రికాకు రవాణా చేయబడుతుంది.వివిధ నైజీరియా నేరముఠాలు రాజకీయ, సైనిక ప్రముఖులతో విస్తారమైన సంబంధాలను కలిగి ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube