అమెరికాపై ఉగ్రదాడి చేస్తా..అమెరికన్..!!!  

Terrorists Attack In America-

 • అమెరికాలో పుట్టి పెరిగిన న్యూయార్క్ కి చెందిన “జీసస్ విల్‌ఫ్రెడో ఎన్‌కార్నేషన్” అనే వ్యక్తి ఏకంగా అమెరికానే నాశనం చేయాలని అనుకున్నాడు. అంతేకాదు నాకు చంపాలని ఉంది, ప్రజల తలలు నరికి తుపాకీతో కాల్చి వీడియోలు తీయాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 • అమెరికాపై ఉగ్రదాడి చేస్తా..అమెరికన్..!!!-Terrorists Attack In America

 • అయితే ఈ వ్యాఖ్యలు చేసింది కూడా ఎవరితోనో కాదు. ఓ ఎఫ్‌‌బీఐ ఏజెంట్‌ తో.

 • Terrorists Attack In America-

  అయితే అతడి ద్వారా పాకిస్తాన్‌ కి చెందినా టెర్రరిస్టు సంస్థ లష్కరే తాయిబా లో చేరడం అతడి ఆశయం. అందుకోసం అతడు ఏళ్ల తరబడి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు అమెరికా నుంచి యూరప్ బయలుదేరాడు.

 • యూరాప్‌ వెళ్లి అక్కడ కొంతమంది పాక్ టెర్రరిస్టులను కలిసి వారితో పాటు పాకిస్తాన్ వెళ్లి తన పధకం అమలు చేయాలని అనుకున్నాడు.

  పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తరువాత న్యూయార్క్ పై ఉగ్రదాడి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

 • అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి వల పన్నారు. అతడు న్యూయార్క్ దాటకుండానే అరెస్ట్ చేశారు.

 • అతడి నేరం గనుకా రుజువైతే దాదాపు 40 ఏళ్ల వరకూ అతడు జైలు ఊచలు లేక్కపెట్టాల్సిందే.