అంబానీకి ఉగ్రవాదుల హెచ్చరిక.. ఆ కారు పెట్టింది తామేనంటూ లేఖ.. ?

బిలీనియర్ ముకేశ్​అంబానీ ఇంటి సమీపంలో గత రెండు రోజుల క్రితం గుర్తు తెలియని అగంతకులు ఓ లెటర్ తో పాటూ 20 జిలిటెన్‌ స్టిక్స్‌ ఉంచిన వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.కాగా ఆంటిల్లా సమీపంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియోను ముంబై పోలీసులు గుర్తించారు.

 Terrorist Warning To-TeluguStop.com

అదీగాక ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలను ఉద్ధేశించి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి.

 Terrorist Warning To-అంబానీకి ఉగ్రవాదుల హెచ్చరిక.. ఆ కారు పెట్టింది తామేనంటూ లేఖ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దర్యాప్తులో భాగంగా ముఖేష్ అంబానీని టార్గెట్ చేసింది ఐష్-ఉల్-హింద్ ఉగ్రవాదులేనని అనుమాన వ్యక్తం చేసారు.అయితే వారి అనుమానాన్ని నిజం చేస్తూ పేలుడు పదార్థాలతో కారు పార్క్ చేసింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఐష్ ఉల్ హింద్ టెలిగ్రామ్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వీరు ఎందుకు ఇలా చేశారు అనే దానికి పూర్తి సమాచారం లభ్యం కాలేదట.కానీ ముఖేష్ అంబానీని బిట్ కాయిన్ ద్వారా డబ్బుల్ని డిమాండ్ చేశారు.

అందువల్ల మరోసారి ఏదైనా పొరబాటు చేస్తే అంబానీ కుటుంబం మొత్తాన్ని అంతం చేయడానికి పూర్తి సన్నద్ధతతో వస్తానని బెదిరించినట్టు ప్రచారం.ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసమున్న ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు.

కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారట.

#Jaish Ul Hind #Terrorist #Mubai #Ambani #Warning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు