ఈస్టర్ రోజున శ్రీలంకలో ఘోరం! క్రైస్తవులే టార్గెట్ గా ఉగ్రదాడి  

శ్రీలంకలో క్రైస్తవులు లక్ష్యంగా ఉగ్ర దాడులు. .

Terrorist Serial Bomb Blasts In Sri Lanka-in Sri Lanka,terror Attacks,terrorist Serial Bomb Blasts

ప్రపంచం మొత్తం క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ వేడుకని జరుపుకుంటుంది. అందరూ భక్తులు క్రీస్తు ఆరాధనలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఉగ్రభూతం వారిని భయపెడుతుంది అని అస్సలు ఊహించి ఉండరు..

ఈస్టర్ రోజున శ్రీలంకలో ఘోరం! క్రైస్తవులే టార్గెట్ గా ఉగ్రదాడి-Terrorist Serial Bomb Blasts In Sri Lanka

అయితే శ్రీలంకలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని కొలంబో సహా. చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లకి పాల్పడ్డారు.

చర్చిలని టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు చేసారు.

కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో జరిగిన శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో ఎంత మంది చనిపోయిందీ ఇంకా తెలియట్లేదు.

80 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది.

చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు… చెల్లా చెదురుగా పరుగులు తీశారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా.