బెంగుళూరు లో ఉగ్రకలకలం

బెంగుళూరు లో ఉగ్రవాదులు ప్రవేశించారా అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల శ్రీలంక లో వరుస బాంబు పేలుళ్ల తో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

 Terrorist Caught Hold In Bangalore-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారత్ లోని పలు నగరాలలో ఉగ్రవాద చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటలిజెన్స్ అధికారులు ప్రకటించారు.ఈ క్రమంలో నగరంలోని పలు చోట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా బెంగుళూరు నగరంలో ఉగ్రకలకలం చోటుచేసుకుంది.బెంగుళూరు లోని అత్యంత కీలక ప్రాంతమైన మెజిస్టిక్ మెట్రో స్టేషన్ లో అనుమానిత ఉగ్రవాది సంచరించినట్లు తెలుస్తుంది.

మెటల్ డిటెక్టర్ ల సాయం తో ఆ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో అతడి వద్ద తుపాకీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనితో అతడిని విచారిస్తుండగా ఆ అనుమానితుడు తప్పించుకున్నట్లు సమాచారం.

అయితే అసలు అతడు ఉగ్రవాదేనా అతని వద్ద ఎందుకు గన్ ఉంది అన్న దానిపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.అయితే ప్రస్తుతం ఆ అనుమానితుడు కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఈ తాజా ఘటన తో బెంగుళూరు లో మరింత భద్రత ను కట్టుదిట్టం చేసే పనిలో పడ్డారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube