మెడలో భయంకరమైన పాము.. ఫొటోలకు యువకుడి ఫోజులు!

పాములను ఆమడదూరం నుంచి చూస్తేనే అందరూ గజగజ వణికిపోతుంటారు.ఇక మరింత దగ్గరగా చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోక తప్పదు.

 Terrible Snake In The Neck  Young Man Stills For Photos , Snake , Viral Latest-TeluguStop.com

ఇక కొండచిలువ, అనకొండ వంటి పెద్ద పాములను క్లోజప్ లో చూస్తే పై ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. పాములు అంత భయంకరంగా ఉంటూ మనల్ని బాగా భయపెట్టిస్తాయి.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మనుషులకు పాములంటే భయం ఉంటుందా అనే అనుమానం కలగక మానదు.ఎందుకంటే ఈ వీడియోలలో మనుషులు అతిపెద్ద పాములను తమ మెడలో వేసుకుంటారు.

వాటిని పెంపుడు జంతువుల్లాగా పెంచుతుంటారు.వాటితో ఆడుకుంటారు.

ఇంకా వాటితో రకరకాల పనులు చేస్తుంటారు.అయితే తాజాగా ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు భారీ కొండచిలువ లేదా ఫైతాన్‌ను తన మెడలో వేసుకుని కెమెరాకు ఫోజులు ఇస్తున్నట్లు చూడొచ్చు.

ఇంతలోనే పాము అతని ముఖాన్ని అమాంతం మింగేయడానికి పైకి వచ్చింది.ఈ ట్విస్ట్ ఊహించని సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.వెంటనే తన ముఖాన్ని పాముకు దూరంగా పెట్టాడు.చాలా పెద్దగా ఉన్న ఈ పాము తల తన ముఖం వద్దకు రాగానే అతని గుండె ఆగినంత పనయ్యింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు వామ్మో ఇతనికి ఎంత ధైర్యమో అని కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదం అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్, 20 వేలకుపైగా లైకులు వచ్చాయి.దీనికి సంబంధించిన వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube