రోడ్దు ప్రమాద రూపంలో వెంటాడిన మృత్యువు.. తెగిపడిన తల.. !- Terrible Road Accident The Head Of A Severed Young Man

terrible road accident the head of a severed young man Guntur, Terrible road accident, head severed, young man - Telugu Guntur, Head Severed, Terrible Road Accident, Young Man

వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం మనిషి ప్రాణాలు పోవడానికి ముఖ్యకారణంగా మారుతుంది.ఇలా నిత్యం తెలిసో, తెలియకో, ఉత్సాహంతో అవగహన లేక డ్రైవింగ్ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలను బలికొంటుంది.

 Terrible Road Accident The Head Of A Severed Young Man-TeluguStop.com

తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా‌లో సంభ‌వించింది.ఆ వివరాలు చూస్తే.

కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్‌ సాదిక్‌ (18) గుంటూరు రూరల్‌ మండలం లోని వెంగళాయపాలెంలో బంధువుల ఇంట జరిగిన వివాహానికి రెండు రోజల కిందట కారులో వచ్చాడట.నిన్న సాయంత్రం తిరిగి తన స్వగ్రామం వెళ్లుదాం అనుకున్న సమయంలో పెళ్లింటి బంధువులు ఏదో పని చెప్పడంతో దీని కోసం బేగ్‌ ఖాదర్‌ నాగుల్‌ బాషా (15), పఠాన్‌ లాలు (19)లతో కలసి కారులో బయలుదేరాడు.

 Terrible Road Accident The Head Of A Severed Young Man-రోడ్దు ప్రమాద రూపంలో వెంటాడిన మృత్యువు.. తెగిపడిన తల.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఆ కారును తాను నడపకుండా పఠాన్‌ లాలు అనే యువకుడికి ఇవ్వగా, అతను మితిమీరిన వేగంతో వెళ్లుతూ స్దానికంగా ఉన్న జగ్జీవన్‌రామ్‌ సెంటర్‌లో రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు.కాగా ఈ ప్రమాదంలో ఖాదర్‌ నాగుల్‌ బాషా, సాదిక్‌లు అక్కడికక్కడే మరణించగా కారునడుపుతున్న లాలుకు స్వల్ప గాయాలయ్యాయి.

కాగా ఈ ప్రమాదంలో ఓ యువకుడి తలతెగి రోడ్డుపై పడటం దారుణం.దీన్ని బట్టి చూస్తే కారునడపడంలో నిర్లక్ష్యం అర్ధం అవుతుంది.

#Young Man #Head Severed #TerribleRoad #Guntur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు