మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు.. !

ఉత్త‌ర మెక్సికో స‌రిహ‌ద్దు రాష్ట్రం లోని సోనోరాలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది.ఈరోజు తెల్లవారు జామున నోషీ బ్యుయెనా గనికి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీ కొన్నాయని సమాచారం.

 Terrible Road Accident In Mexico-TeluguStop.com

కాగా ఈ ప్ర‌మాదంలో 16 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 14 మంది తీవ్రంగా గాయ ‌పడినట్టు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రమాదం లోని బాధితులంతా నోచే బ్యూనా గ‌నికి చెందిన వార‌ని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ప్ర‌మాదంలో రెండు వాహ‌నాలు పూర్తిగా ద్వంసం అవగా, చనిపోయిన వారంతా ఆ బస్సులోనే చిక్కుకు పోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది.ఇక మృతులంతా మెక్సికోకు చెందిన వారేనట.

 Terrible Road Accident In Mexico-మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రెండు బస్సులు అతి వేగంతో ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందట.కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారట.

#Terrible #Injured #Killed #Mexico #Road Accident

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు