ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. యమపురికి దారి చూపిన కారు డ్రైవర్ నిద్రమత్తు.. !

అసలే కరోనా కారణంగా ఎన్ని పనులున్నా, ఫంక్షన్లున్నా, ఎంతటి ఆత్మీయులైనా సరే ఎవరింట్లో వారుండి ప్రాణాలు కాపాడుకొమ్మని చెబితే ఈ సమాజంలో ఎంతమంది వింటున్నారు.

బయటకు అత్యవసరం అయితేనే వెళ్లండని, మీ ప్రాణాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు, మీరు తీసుకునే రక్షణ చర్యలు శ్రీరామ రక్ష అని అధికారులు విసుగుపుట్టేలా పదే పదే చెబుతున్నా వినక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు.

ప్రస్తుతం ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

Horrible Road Accident In Ap East Godavari District, AP, East Godavari District

తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన కుటుంబం ఈ తెల్లవారుజామున ఓ శుభకార్యానికి కారులో రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లుతుండగా, పెద్దాపురం ఏడీబీ రోడ్డు దగ్గర్లోని, రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది.కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతావారు తీవ్ర గాయలపాలైయ్యారట.

ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనకు కారణం డ్రైవర్ నిద్రమత్తే అని ప్రాథమికంగా నిర్ధారించారట.చూశార చిన్న నిర్లక్ష్యం, త్వరగా వెళ్లాలనే ఆత్రుతత, కారు డ్రైవర్ నిద్రమత్తు ఇవన్ని యమపురికి దారి చూపించాయి.

Advertisement
మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?

తాజా వార్తలు