ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. యమపురికి దారి చూపిన కారు డ్రైవర్ నిద్రమత్తు.. !

అసలే కరోనా కారణంగా ఎన్ని పనులున్నా, ఫంక్షన్లున్నా, ఎంతటి ఆత్మీయులైనా సరే ఎవరింట్లో వారుండి ప్రాణాలు కాపాడుకొమ్మని చెబితే ఈ సమాజంలో ఎంతమంది వింటున్నారు.బయటకు అత్యవసరం అయితేనే వెళ్లండని, మీ ప్రాణాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు, మీరు తీసుకునే రక్షణ చర్యలు శ్రీరామ రక్ష అని అధికారులు విసుగుపుట్టేలా పదే పదే చెబుతున్నా వినక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు.

 Terrible Road Accident In Ap-TeluguStop.com

ప్రస్తుతం ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.

 Terrible Road Accident In Ap-ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. యమపురికి దారి చూపిన కారు డ్రైవర్ నిద్రమత్తు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన కుటుంబం ఈ తెల్లవారుజామున ఓ శుభకార్యానికి కారులో రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లుతుండగా, పెద్దాపురం ఏడీబీ రోడ్డు దగ్గర్లోని, రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది.కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతావారు తీవ్ర గాయలపాలైయ్యారట.

ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనకు కారణం డ్రైవర్ నిద్రమత్తే అని ప్రాథమికంగా నిర్ధారించారట.చూశార చిన్న నిర్లక్ష్యం, త్వరగా వెళ్లాలనే ఆత్రుతత, కారు డ్రైవర్ నిద్రమత్తు ఇవన్ని యమపురికి దారి చూపించాయి.

.

#EastGodavari #ADB Road #Driver In Sleep #TerribleRoad #SameFamily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు