ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన యాత్రికుల బస్సు.. ఎక్కడంటే.. ?

Terrible Accident Pilgrim Bus That Fell In The Valley

విధి ఆడే ఆటలో మనుషులంతా కీలు బొమ్మలే.అందుకే కావచ్చూ మనిషి పుట్టుక, చావులకు ఎవరు బాధ్యులుకారని అంటారు.

 Terrible Accident Pilgrim Bus That Fell In The Valley-TeluguStop.com

ఈ రెండు బ్రహ్మ రహస్యాలని పేర్కొంటారు.

ఇక లోకంలో మరేణించే వారు మరణిస్తూనే ఉన్నారు.

 Terrible Accident Pilgrim Bus That Fell In The Valley-ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన యాత్రికుల బస్సు.. ఎక్కడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పుట్టే వారు పుడుతూనే ఉన్నారు.ఎవరి కోసం కాలం ఆగడం లేదు.

కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే మరణాలని చూస్తే బాబోయ్ ఇలాంటి చావు మనకొద్దు అనిపిస్తుంది.ముఖ్యంగా ప్రమాదాల్లో అయితే ఆ చావు ఘోరంగా ఉంటుంది.

అయినా విధిరాతను ఎవరు మాత్రం తప్పిస్తారు చెప్పండి.ఇకపోతే ఇండోనేషియాలోని జావా దీవిలో నిన్న అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకుంటే.

పశ్చిమ జావాలోని ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు విహార యాత్రకు బయల్దేరారు.

ఈ యాత్రలో టీచర్లతో పాటుగా విద్యార్ధుల తల్లిదండ్రుల కూడా జాయిన్ అయ్యారు.ఎంతో ఆనందంగా సాగుతుందని అనుకున్న వీరి ప్రయాణం దారిలో పోంచి ఉన్న మృత్యువు ఒక్క సారిగా కబళించింది.

ఇలా యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది.కాగా ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయట.అయితే బస్సు బ్రేకులు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారట.

#Java Island #Terrible #Indonesia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube