ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం.. !

ప్రజలకు, ప్రపంచానికి వినాశనం మూడినట్లుగా ఉంది.లేకుంటే ఈ ప్రమాదాలు ఏంటో, మరణాల లెక్కలు ఏందో, తెగ నమోదు అవుతున్నాయి.

 Terrible Accident On Outer Ring Road Driver Cleaner Burnt Aliv-TeluguStop.com

ఈ మధ్య కాలంలో కరోనాతో మరణించిన, మరణిస్తున్న సంఖ్యను చూస్తే గుండెల్లో దడపుడుతుంది.అది చాలదన్నట్లుగా రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు తెగముచ్చటపడుతూ పలకరిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ రోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు ఈ ప్రమాదంలో చేసుకుంది.లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అవడం విషాదకరం.

 Terrible Accident On Outer Ring Road Driver Cleaner Burnt Aliv-ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ వివరాలు చూస్తే.

Telugu Burnt Alive, Driver Cleaner, Hyderabad, Outer Ring Road, Terrible Accident-Latest News - Telugu

ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది.దీంతో ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగడంతో లారీ క్యాబిన్ లో ఉన్న సూరజ్ (45), మూర్తునుజన్ (40) అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనమయ్యారట.

కాగా ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్ లతో మంటల ను అదుపు చేసే లోపే రెండు ప్రాణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయిందట.

ఇక ఈ ప్రమాదంలోని మృతులను ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

#Burnt Alive #Outer Ring Road #Hyderabad #Driver Cleaner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు