ఔటర్ రింగు రోడ్డు పై ఘోర ప్రమాదం.. ?- Terrible Accident On Outer Ring Road

Himayat Sagar, Outer Ring road, Terrible accident, death - Telugu Death, Himayat Sagar, Outer Ring Road, Terrible Accident

ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక ప్రమాదం తరచుగా సంభవిస్తూనే ఉంటుంది.ఈ ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 Terrible Accident On Outer Ring Road-TeluguStop.com

ఇక తాజాగా రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై ఘోర ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారట.

ఆ వివరాలు తెలుసుకుంటే.

రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనం రోడ్దు డీవైడర్‌ను ఢీ కొట్టిందట.

దీంతో ఆ టాటా ఎస్ వాహనం బోల్తా కొట్టగా ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ మున్నాతో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.ఇకపోతే ఈ వాహనం పప్పుల లోడ్ తో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

కాగా ఈ ప్రమాదంలో రోడ్దుపై చెల్లా చెదురుగా పడ్డ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారట.ధ్వంసం అయిన ఆ టాటా ఎస్ వావానాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తీశారట పోలీసులు.

ఇకపోతే మృతులకు సంబంధించిన వివరాలు ఏవి తెలియలేదు.ఈ క్రమంలో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.

#Outer Ring Road #Death #Himayat Sagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు