కంచె సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సీట్ కింద బాంబులు?

Terrible Accident In Kanche Movie Shooting Bombs Under The Seat

ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమైన సాయి మాధవ్ తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథలతో అభిమానులకు చేరువయ్యారు.

 Terrible Accident In Kanche Movie Shooting Bombs Under The Seat-TeluguStop.com

రంగస్థలం నుండి సినిమారంగంలోకి ప్రవేశించి సినిమాలో నటించడమేకాకుండా పాటలు, సంభాషణలు రాస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు సాయి మాధవ్.ఇక పోతే ఆయన తీసిన సినిమాలో కంచె చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.

అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది.రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది.ఆగస్టు 15, 2015 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది.

 Terrible Accident In Kanche Movie Shooting Bombs Under The Seat-కంచె సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సీట్ కింద బాంబులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైటర్ గా ఇండోర్ లో కాకుండా, ఔట్ డోర్ లోకి వెళ్తే ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ప్రముఖ రచయిత సాయి మాధవ్ అన్నారు.

జార్జియాలో కంచె షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను టెంట్ లో కూర్చొని రాసుకుంటున్నపుడు, ఆ సమయంలో యుద్ధానికి సంభందించిన సన్నివేశాలు జరుగుతున్నాయని సాయి మాధవ్ బుర్రా తెలిపారు.

Telugu Accident, Bombs, Kancha Movie, Kanche Movie Shooting, Second World War Movie, Shooting, Terrible Accident, Tollywood, Writer Sai Madhav Burra-Movie

దూరం నుంచి అరుస్తూ ఉన్నారు.కానీ నాకేంటో అర్ధం కాలేదు.వాళ్ళు వాళ్ళ షూటింగ్ లో భాగంగా ఏదో అరుస్తున్నారు అనుకున్నాను.

నా మూడ్ లో నేనుండి రాసుకుంటున్నా.అలా రాస్తూ రాస్తూ అలా సెట్ సైడ్ చూసే సరికి అందరూ నా వైపే చూసి పెద్దగా అరుస్తున్నారు.

ఎందుకు అరుస్తున్నారు అనుకున్నా, కానీ వాళ్ళు సైగ చేసి చూపే సరికి అప్పుడు అర్థం అయింది.నా కుర్చీ కిందే బాంబ్ ఉంది అని.వెంటనే అన్ని బ్యాగ్లన్ని సర్దుకొని వెంటనే పరిగెత్తాను అని ఆయన తెలిపారు.ఆ సమయంలో నేను అక్కడ టెంట్ లో ఉన్నానని వాళ్ళు గుర్తించక పోయి ఉంటే సంగతి వేరేలా ఉండేది అని సాయి మాధవ్ అన్నారు.

#Kancha #WriterSai #Bombs #World #Terrible

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube