బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. !

మనుషులకు ఉన్న నిర్లక్ష్యమో, లేక అత్యాశనో తెలియదు గానీ ఒక్కోసారి జరిగే ఘోర ప్రమాదాల వల్ల జరిగే నష్టం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడవేస్తుంది.ఇక రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వ్యవహరించే మనుషులు కనీసం నీటి పై ప్రయాణించేటప్పుడైనా ఆ నిర్లక్ష్యపు చాయలు వదిలితే బాగుండు.

 Terrible Accident In-TeluguStop.com

కానీ అలా జరగలేదు.దీని ఫలితంగా అధిక మొత్తంలో ప్రయాణికులు మరణించిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘోర ప్రమాద ఘటన తాలూకు వివరాలు చూస్తే.ఈ రోజు ఉదయం పద్మ నదిలో బంగ్లా బజార్‌ లోని ఫెర్రీ ఘాట్ నుంచి ప్రయాణీకులతో బయలు దేరిన పడవలో అనుభవం లేని వ్యక్తి పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఇసుక రవాణా చేస్తున్న మరో ఓడను ఢీ కొట్టింది.

 Terrible Accident In-బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు మృతి చెందగా, చాలా మంది ప్రయాణీకులు గల్లంతు అయినట్టు సమాచారం.ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని ఇక్కడి అధికారులు తెలుపుతున్నారట.

నదిలో నిర్లక్ష్యంగా, వేగంగా పడవను నడి ప్రమాదానికి గురి చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

#Bangladesh #Ferry Ghat #Passenger #Ship #Bangla Bazaar

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు