ఏపీలో పది పరీక్షలకు తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలాఖరున 10వ తరగతి పరీక్షలు జరుగబోతున్నాయి అంటూ జరుగుతున్న వార్తలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా చాలా కీలకం కనుక విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పరీక్షలను జులైలో నిర్వహించబోతున్నట్లుగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

 Ap Ssc Date Fix Coronavirus, Tenth Exams, July, Ap Governament, Telangana,-TeluguStop.com

జులై 1 నుండి 15 తారీకు మద్యలో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.ఇక మూల్యాంకనం పరిస్థితి ఏంటీ అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సాదారణంగా అయితే పదవ తరగతి పరీక్షలకు 2900 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.కాని సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్న కారణంగా మరో అయిదు వందల నుండి ఏడు వందల వరకు అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ భావిస్తుంది.

జూన్‌లో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు.పరీక్ష కేంద్రాలకు సంబధించిన నిర్ణయాన్ని త్వరలోనే వెళ్లడి చేయబోతున్నామన్నారు.ఇక తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై సస్పెన్స్‌ నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube