వణికిపోతున్న ఏపీ మంత్రులు ... కారణం ఇదే !

ఇంతకాలం తమకు ఎదురేలేదు… తిరుగేలేదు అని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్న ఏపీ మంత్రులకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గుండెల్లో దడ దడ లు మొదలయ్యాయి.గత ఎన్నికల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు లేకపోవడంతో…
వారిలో కొందరికి ఎన్నికల భయం పుడుతోందట.

 Tensions In Telangana Tdp Ministers Over Kapu Vote Bank-TeluguStop.com

ఎన్నికల్లో పోటీ చేస్తే.గెలుస్తామా లేదా.

అన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందట.ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ భయం ఎక్కువగా ఉందని సమాచారం.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారంతో గట్టెక్కిన వీరంతా ఇప్పుడు ఆయన సొంత కుంపటి పెట్టుకోవడంతో పాటు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు ఓటింగ్ ని తన్నుకుపోవడంతో వీరిలో గెలుపు సందేహాలు కనిపిస్తున్నాయి.

ఈ ఓటమి భయం ఉన్న మంత్రుల్లో ముఖ్యంగా… రోడ్లు,భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు.ఆయన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు.వీరిలో ఎక్కువ మంది అయ్యన్నకు వ్యతిరేకంగా పనిచెయ్యడం అయ్యన్నలో భయం పెంచుతోంది.శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్ననాయుడు కూడా అదే రీతిలో ఓడిపోయి.2014లో ‘పవన్‌’ ప్రభావంతో విజయం సాధించారు.2004లో విజయం సాధించిన యనమల’ 2009లో ఓడిపోయారు.2014లో ఎమ్మెల్సీగా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.మళ్లీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే.ఆయనకు అదే పరిస్థితి ఎదురవుతుంది.

ఇక తూర్పుగోదావరి లో డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంలో ‘జనసేన’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.మంత్రికి ఇక్కడ వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా… జనసేన ప్రభావం తో ఆయన ఓట్లకు గండిపడే అవకాశం ఉందని ఆయన భయం.అలాగే.కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంధ్రది కూడా ఇదే పరిస్థితి.

ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో 2014లో ‘పవన్‌’ ప్రభావంతో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి మంత్రి అయ్యారు.ఇక్కడ ‘జనసేన’ అభ్యర్థి రంగంలోకి దిగితే ‘కొల్లు’కు ఓటమి తప్పదని టిడిపి నాయకులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా ‘దర్శి’ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.మంత్రి శిద్దారాఘవరావుకు ‘జనసేన’ తాకిడితో ఆందోళన చెందుతున్నారు.ఎమ్మెల్యేగా అక్కడ నుండి తాను పోటీ చేయను.ఎంపీగా వెళతాను…అని మంత్రి శిద్ధా అంటున్నట్లు తెలుస్తోంది.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఓటమి భయం పట్టుకుందట.మరో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఉంది.

కానీ ఇక్కడ జనసేన ప్రభావం ఉండదని.వారు చెప్పుకుంటున్నారు.

కానీ ‘జనసేన’ ప్రభావం మంత్రికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయని నియోజకవర్గంలో టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube