జనసేన నేతల్లో పెరుగుతున్న గుబులు..తప్పు చేశామా..???

ఏపీలో ఎన్నికలకి మరో మూడు నెలలు మాత్రమె సమయం ఉంది.ఈ ఎన్నికలకి అన్ని పార్టీలు సర్వం సిద్దంగా ఉన్నాయి.

 Tensions In Janasena Party Soldiers About Ticket-TeluguStop.com

ఐదేళ్ళ క్రితమే పురుడుపోసుకున్న జనసేన పార్టీ తన బలాబలాలు తెలియకపోయినా సరే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని బలంగా వినిపిస్తోంది.ఈ క్రమంలోనే జనసేన కోసం నిర్విరామంగా ఎంతో శ్రమిస్తున్న జనసైనికుల మెదళ్ళలో ప్రశ్నలు పురుగుల్లా తొలిచెస్తున్నాయి.

తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ వచ్చే ఎన్నికల్లో చతికల పడుతుంది అంటూ వస్తున్న కొన్ని వార్తలు , ప్రస్తుత వాస్తవ పరిస్థితులు చూస్తుంటే జనసేన నేతలు సైతం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.జనసైనికులకి అసలు ఎందుకు ఈ ఆందోళన కలిగింది.

పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2008 ఆగష్టు 26న స్థాపించారు.ఆ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ అనే విషయం కూడా అందరికి తెలిసిందే.అయితే ప్రజారాజ్యం పార్టీ పుట్టీ పుట్టగానే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది.దాదాపు 70 లక్షల ఓట్లు సంపాదించింది రికార్డ్ సృష్టించింది.అంత తక్కువ సమయంలో చిరు 16.22 శాతం ఓట్లతో 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు.ఓ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోకి వస్తే.

ప్రజారాజ్యం పార్టీలో వచ్చి పొరబాట్లు చేయను అంటూనే ఐదేళ్ళ క్రితం పుట్టిన పార్టీని ఇప్పటి వరకూ కూడా బలపరుచుకోలేదు సరికదా, రెండు పడవలపై కాళ్ళు పెట్టుకుని అదేళ్ళు నెట్టుకొచ్చారు.అసలు 2019 పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరి పోరు సలుపుతుంది అనుకున్నప్పుడు ముందుగానే గ్రౌండ్ చేసుకోవాలి కదా.అలా కాకపోయినా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు గ్రామస్థాయిలో బలోపేతం చేసుకోకుండా, బలమైన నాయకులని తయారు చేసుకోకుండా కాలక్షేపం చేసి ఇప్పుడు ఒకే సారి ఎన్నికల బరిలోకి దూకేస్తే విజయం ఎలా సాదిస్తాము అనే ప్రశ్నలు ఇప్పుడు జనసేనలో చేరిన నేతల్లో ఉత్పన్నం అవుతున్నాయి.

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఎవరో తెలీదు.అసలంటూ పార్టీకి పూర్తి స్థాయి కమిటీలు కూడా లేవు.మీడియాలో పవన్ తప్ప గట్టిగా మాట్లాడే దమ్మున్న నేతలే లేరు.

ఈ రకమైన పరిస్థితి పార్టీలో ఉంటె తమ ఉనికిని ఎలా చాటుకునేది అంటున్నారు.నేతలు.

అయితే జనసేనలో జంప్ అయిన నేతలు లోపలికి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితి చూసి పరేషాన్ అవుతునన్నారట.అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీలోకి ఎందుకు వచ్చామా అంటూ ఆందోళన చెండుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి జనసైనికులలో ఉన్న ఈ ఆందోళన జనసేనాని వరకూ వెళ్ళినా ఇందుకు పరిష్కారం పవన్ చూపిస్తారా.?? వారికి ఎలాంటి భరోసా ఇస్తారు అనేది తేలాల్సిఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube