హాంకాంగ్ లో ఉద్రిక్తత...ప్రజలపై పోలీసుల లాఠీ ఛార్జ్

హాంకాంగ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివాదాస్పదమైన నేరస్తుల అప్పగింత బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలకు దిగిన లక్షలాది జనం వీధుల్లో పోటెత్తారు.

 Tensions Continues In Hong Kong 1-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ ముట్టడికి యత్నించడం తో పోలీసులు విరుచుకుపడ్డారు.బారికేడ్లు విరగొట్టుకుంటూ లోపాలకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలను అడ్డుకోవడానికి పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ కి దిగారు.

దీనితో ఒక్కసారిగా ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వడం తో పరిస్థితి చేయి దాటిపోవడం తో వారిపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లు,వాటర్ క్యాన్స్,పెప్పర్ స్ప్రే తో పాటు బాష్ప వాయువును కూడా ప్రయోగించారు.దీనితో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

దీంతో గురువారం ఉదయం అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు.ఈ వారాంతం వరకు వీటిని మూసి ఉంచుతామని వారు ప్రకటించారు.

-Telugu NRI

హాంకాంగ్ ను బ్రిటన్ చైనాకు అప్పగించిన అనంతరం ఈ నగరంలో ఇంత ఘర్షణ, యుధ్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి.హాంకాంగ్ లోని నేరస్థులను, అవినీతిపరులను చైనాకు అప్పగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు.అయితే ప్రభుత్వం స్పందించి ఈ బిల్లుపై పునరాలోచన చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రజలు మాత్రం శాంతించ కుండా ఆందోళనలు ఉదృతం చేసారు.దీనితో అక్కడ నానాటికి హింస పెరిగిపోతుంది.

ఈ ఘర్షణల్లో గాయపడిన వందలాది మందిని ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube