ప్రధాన పార్టీలకు మొదలైన రెబెల్స్ నామినేషన్ ల టెన్షన్...

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ ల పర్వం ఊపందుకుంది.ఇప్పటికే ప్రధాన పార్టీలు నామినేషన్ లు వేసిన పరిస్థితి ఉంది.

 Tension Over Rebel Nominations For Major Parties .huzurabad Elections, Trs Party-TeluguStop.com

ఇంకా నామినేషన్ ల గడువు ముగియకపోవడంతో ఆసక్తి ఉన్న వారు కూడా నామినేషన్ లు వేస్తున్న పరిస్థితి ఉంది.అయితే పార్టీలకు ఓటమి, గెలుపుపై మీద ఎంతగా టెన్షన్ ఉందో నామినేషన్ పై కూడా అంతే టెన్షన్ గా ఉన్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే నామినేషన్ ల ఎఫెక్ట్ ఎంతలా గెలుపు, ఓటమిలపై ప్రభావం చూపెడుతుందనడానికి చక్కటి ఉదాహరణ.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో పసుపు బోర్డు హామీని నెరవేర్చకపోవడంతో పసుపు రైతులు మాజీ ఎంపీ కవితకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కూడా ఫీల్డ్ అసిస్టెంట్ లు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.

Telugu @bjp4telangana, Huzurabad, Trs-Political

ఏది ఏమైనా ఎటువంటి వారైనా తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు.అయితే వేసిన నామినేషన్ లలో చివరకు నిలిచేవి కొన్నైనా ఓట్ల మీద మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం మాత్రం వంద శాతం ఉంది.ఎందుకు ఖచ్చితంగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే నిజామాబాద్ లో పసుపు రైతులు వేసిన నామినేషన్ మాజీ ఎంపీ కవిత ఓటమికి కారణమయిందంటే ప్రభుత్వ వ్యతిరేక నామినేషన్ లు చాలా వరకు ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లలో చీలికలు వచ్చే అవకాశం ఉంది.అందుకే ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ లు కావచ్చు, ఇతర రెబెల్స్ అభ్యర్థులు కావచ్చు వారిని నామినేషన్ వితరణ గడువులోగా బుజ్జగించే అవకాశం ఉంది.

ఒకవేళ వారిని బుజ్జగించే చర్యలు చేపట్టని పక్షంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube