తిరుపతిలో టెన్షన్ వాతావరణం.. ఇందంతా దానికోసమేనటా.. ?- Tension In Tirupathi Over Elections

andrapradesh, tdp, bjp, ycp - Telugu Andrapradesh, Bjp, Tdp, Ycp

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్ హీట్ పెరుగుతుంది.అదీగాక ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం ఘటనలను పొలిటికల్‌ మైలేజ్‌గా మల్చుకునేందుకు టీడీపీ, బీజేపీలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.

 Tension In Tirupathi Over Elections-TeluguStop.com

ఇదే కాకుండా త్వరలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు ఇంతగా వేడెక్కుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి బీజేపీ దేవాలయాల పరిరక్షణ పేరుతో రథయాత్ర చేస్తామని ప్రకటించింది.

 Tension In Tirupathi Over Elections-తిరుపతిలో టెన్షన్ వాతావరణం.. ఇందంతా దానికోసమేనటా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో టీడీపీ కూడా రంగంలోకి దిగి ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్‌ సిద్ధం చేసింది.ఇక ఈ యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు అప్లికేషన్‌ కూడా పెట్టుకున్నారు ఈ రెండు పార్టీల వారు.

ఒకవైపు త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు రెండింటికీ అనుమతి నిరాకరించారు.అసలే వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు, మరో వైపు కమలనాధుల వ్యూహం, ఆలయాలపై దాడులు, వీటికి తోడుగా రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం.

ఇలాంటి పరిస్దితుల్లో దేవాలయాల పరిరక్షణ యాత్ర పేరుతో లాభపడాలనుకుంటున్న బీజేపీ, టీడీపీ ఆశలపై నీరు చల్లినట్లు అవడంతో ప్రస్తుతం తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొందట.

#Andrapradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు