హుజురాబాద్ లో గెలుపు పై ఈటెలలో టెన్షన్...ఎందుకంటే

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నిక  గెలుపు భవిష్యత్తులో వారి పార్టీ అభివృద్ధిపై మరియు గెలుపుపై ప్రభావం చూపిస్తుంది.

 Tension In The Spears Over Victory In Huzurabad ... Because Trs Party, Telangana-TeluguStop.com

అంతేకాక దుబ్బాక ఉప ఎన్నిక ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించిందో ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో గెలిచే పార్టీ ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కూడా బలపదుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో టాప్ లీడ్ లో ఉన్న పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ అన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరపున ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ అనేది టీఆర్ఎస్ కు కంచుకోట.

అయితే  హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం ఎంత ముఖ్యమో, ఈటెల రాజేందర్ కూడా గెలవడం అంతే ముఖ్యం .ఎందుకంటే ఈటెల రాజేందర్ గత 5 సార్లు ఇక్కడ నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు.

అయితే టీఆర్ఎస్ పార్టీలో కావడంతో గెలుపు చాలా సునాయాసంగా నడిచింది.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి రావడంతో బీజేపీ పార్టీలో చేరినా బీజేపీకి పెద్దగా హుజూరాబాద్ లో పెద్దగా బలం లేకపోవడం ఈటెలకు కాస్త ఇబ్బందిగా మారింది.

అంతేకాక టీఆర్ఎస్ కూడా దళిత బంధు పధకంతో ఒకసారిగా బీజేపీని వెనక్కి నెట్టిన పరిస్థితి ఉంది.అందుకే ఇప్పుడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో గెలుపు పట్ల కొంత టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించిన తరువాత పరిస్థితులు పూర్తిగా టీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube