టీ కాంగ్రెస్‌లో గుబులు .. రీజ‌న్ ఇదే...!

త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు రానున్నాయి.దీంతో ఆ పార్టీలో తీవ్ర గుబులు రేగుతోంది.

 Tension In T Congress..this Is The Reason, Telangana, Trs, Kcr, Ktr, Harish Rao,-TeluguStop.com

అదేం టి? అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు స‌మ‌స్య‌.గ్రేట‌ర్ ఎన్నిక‌లు మామూలుగా జ‌రిగేలా లేవు.

మ‌రీ ముఖ్యంగా దుబ్బాక విజ‌యంతో దూకుడు మీదున్న బీజేపీ.మ‌రింత దూకుడుగా ఇక్క‌డ పాగా వేసేందుకు మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.

అదే స‌మ‌యంలో అధికార టీఆర్ ఎస్ త‌న స‌త్తాను చాటుకునేందుకు ఎంత వ‌ర‌కైనా పోరాటాన్ని ముమ్మ‌రం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.ఒక‌ప్పుడు కీల‌క నేత‌ల‌తో హ‌డావుడిగా ఉండే హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్ నేడు నేత‌లు లేక బోసి పోతోంది.వ‌రుస‌గా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బోల్తాప‌డ‌డం.త‌ర్వాత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టు సాధించ‌క‌పోవ‌డం.

అదేస‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌లేక‌పోవ ‌డం వంటివి.రాజ‌కీయంగా కాంగ్రెస్‌కు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆ నాడు ప్ర‌జ‌ల‌కు చెప్పుకొన్నా.తెలంగాణ కోసం.

తాము కూడా త్యాగాలు చేశామ‌ని.నాయ‌కులు చెప్పినా.

ఆశించిన రీతిలో ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకోలేక పోయారు.ఈ ప‌రిణామం.

పార్టీపై తీవ్రంగా ఉంద‌నేది వాస్త‌వం.

అదే స‌మయంలో.

కీల‌క‌నేతలు, మాజీ మంత్రులు అయిన‌.స‌బితా ఇంద్రారెడ్డి, నాగేంద‌ర్‌, సుధీర్‌రెడ్డి, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ లు ఇప్పుడు పార్టీకి దూర‌మ‌య్యారు.

ముఖేష్ గౌడ్ మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు.మిగిలిన వారిలో స‌బిత ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ మంత్రి, అదేవిదంగా దానం నాగేంద‌ర్ కూడా కేసీఆర్ పంచ‌నే ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నాయ‌క‌త్వం వ‌హించే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు.పోనీ.

ఉత్త‌మ్ కుమార్ ఉన్నారుగా అంటే.ఇప్ప‌టికే అన్ని ఎన్నిక‌ల్లోనూ విఫ‌లం కావ‌డంతో ఆయ‌న‌పై విఫ‌ల‌మైన నాయ‌కుడిగా ఆయ‌న పేరు ప‌డ్డారు.

ఆయ‌న ఎంపీగా గెలిచాక త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో త‌న భార్య‌ను పోటీ పెట్టే ఆయ‌న గెలిపించుకోలేక‌పోయారు.దీంతో ఉత్త‌మ్ నాయ‌క‌త్వంపై సొంత పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌కం లేదు.

ఇటు గ్రేట‌ర్లోనూ స‌రైన నాయ‌కులు లేరు.దీంతో రానున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌తికి బ‌ట్ట క‌డుతుందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.మ‌రి ఇప్ప‌ట‌కైనా వందేళ్ల చ‌రిత్ర ఉన్న పార్టీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube