అఖిల్ ఎంట్రీతో 'మా' ఎన్నికల్లో ఉద్రిక్తత..!

టాలీవుడ్ లో ప్రస్తుతం మా ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి.ఈ రోజు మా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అందరిలో ఒక టెన్షన్ మొదలయ్యింది.

 Tension In Maa Elections With Akhil Entry, Akhil Akkineni, Maamaa Association El-TeluguStop.com

ఎప్పుడు లేనంత హడావిడిగా రసవత్తరంగా ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అందరిలో ఒక రకమైన ఉత్కంఠ మొదలయ్యింది.ఈ రోజు సాయంత్రానికి రిజల్స్ తెలుస్తాయి కాబట్టి అప్పటి వరకు ఈ టెన్షన్ అందరిలో ఉంటుంది.

ఎప్పుడు సాదాసీదాగా జరిగే మా ఎన్నికలు ఈసారి వాద ప్రతివాదనలు చేసుకుంటూ హీట్ పెంచేసాయి.మా అధ్యక్షా పదవికి చాలా మంది పోటీ పడగా చివరికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు.

ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది.వీరిద్దరూ మధ్య పోటీ గట్టిగానే ఉండడంతో ఎవరు గెలుస్తారా అని అందరిలో ఒక ఉత్కంఠ కలుగుతుంది.

ఇద్దరికీ కూడా మద్దతు దారులు కూడా బలంగానే ఉండడంతో చివరి నిముషం వరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కూడా కష్టంగానే మారింది.మా ఎన్నికలు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరుగుతుండగా సెలెబ్రిటీలు కూడా ఓటు వేసేందుకు తరలి వచ్చారు.

ఎప్పుడు లేనంతగా ఈసారి ఓట్లు వేయడానికి పెద్ద మొత్తంలో సభ్యులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

మా లో మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ఓటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

గత 20 రోజులుగా మా ఎన్నికల నేపథ్యంలో పోట్లాటలు, విమర్శలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఎవరి గెలుస్తారా అని అందరు ఎదురు చుస్తున్నారు.ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్, నిఖిల్ వంటి హీరోలు పాల్గొనగా తాజాగా అఖిల్ కూడా ఓటు వేసేందుకు వచ్చాడు.

Telugu Akhil Akkineni, Maa, Maamaa, Lati Charge, Maa Akhil-Movie

అయితే అఖిల్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డగించగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఫ్యాన్స్ వినకపోగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.4 తర్వాత ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతుంది.మరి చూడాలి ఎప్పుడు లేనంతగా జరిగిన మా ఎన్నికల్లో చివరకు ఎవరు విజయం సాధిస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube