కేసీఆర్ నిర్ణ‌యంతో ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌.. ఇమేజ్ త‌గ్గుతుందా..?

రాష్ట్రంలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి.ఇప్ప‌టికే ఆయ‌న ప‌నితీరులో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.

 Tension In Emmelle With Kcr Decision   Will The Image Decrease , Kcr, Trs  , Ts-TeluguStop.com

గ‌తంలో కంటే చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు.ఏ విష‌యంపై అయినా స‌రే వెంట‌నే స్పందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాగా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ ఇమేజ్‌ను పెంచుకునే ప‌నిలో ప‌డ్డాయి.వ‌రుస యాత్ర‌లు, దీక్ష‌ల‌తో హోరెత్తిస్తున్నాయి.

ఇక వీరి ఇమేజ్‌కు క‌ట్ట‌డి వేయాలంటే త‌మ పార్టీని కూడా గ్రామ స్థాయినుంచి మ‌రోసారి బ‌ల‌ప‌ర‌చాల‌ని భావిస్తున్నారు.

ఇందుకోసం కేసీఆర్ వ్యూహత్మకంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి త్వ‌ర‌లోనే గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి కొత్త క‌మిటీల‌ను నియ‌మించాల‌ని భావిస్తున్నారు.ఈ మేర‌కు రీసెంట్ గా జరిగిన టీఆర్ ఎస్ కార్యవర్గ మీటింగ్ లో కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

ఇక ఈ క‌మిటీల‌ను కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే నియ‌మించాల‌ని, వీరితో పాటు రాష్ట్రస్థాయి దాకా ఇప్పుడు ఉన్న క‌మిటీల‌ను మార్చేసి కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆదేశించారు.దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు.

Telugu Dalitha Badu, Etala Rajendher, Grama Commites, Harish Rao, Huzurabad, Kcr

అయితే ఇక్క‌డే ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కు వ‌చ్చిప‌డింది.ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కొత్త జిల్లాల‌కు అధ్యక్షులు లేక‌పోవ‌డంతో ఇప్పుడు కొత్తగా క‌మిటీల‌ను నియ‌మించాలంటే ఉన్న ఒక్క పోస్టుకు ఎవ‌రిని సిఫార‌సు చేయాల‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.ఇక ఇప్ప‌టికే కొత్త జిల్లాల్లో రెడు లేదంటే మూడు వ‌ర‌కే నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.అయితే ఇందులో ఎవ‌రిని నియ‌మించినా త‌న అనుచ‌రుల‌కు ద‌క్క‌క‌పోతే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర ఎమ్మెల్యేల ముందు తాము త‌క్కువ అయిత‌పోతామేమో అని భావిస్తున్నారు.

ఇక కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను కాద‌ని వేరే వారిని నియ‌మిస్తే గ‌న‌క కొత్త ఇబ్బందులు కూడా ఏర్పడుతాయి.చూడాలి మ‌రి ఎమ్మెల్యేల హ‌వా ఏ మేర‌కు ఉంటుందో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube