జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత! అమరావతిలో పవన్ పర్యటించే ప్రయత్నం

అమరావతి అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజు మూడు రాజధానుల అంశాన్ని అధికార పార్టీ వైసీపీ స్పష్టం చేయడంతో పాటు పరిపాలన రాజధానిని విశాఖగా ప్రకటించేశింది.ఈ ప్రకటన తర్వాత అమరావతిలో ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులని మోహరించింది.

 Tension Environment On Janasena Party Office In Mangalagiri-TeluguStop.com

చట్టంతో ప్రజలని, రైతులని అణచివేసి, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు అన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మరో వైపు రాజధాని అమరావతి ప్రాంత రైతులు కూడా ఆందోళనకి సిద్ధం అవుతున్నారు.

ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ని అమల్లో పెట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన పార్టీ అత్యవసరం సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం రాజధాని గ్రామాలలో పర్యటించాలని, రైతులకి అండగా నిలబడాలని భావించినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తున మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంకి చేరుకొని పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే ఈ సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ ఉండటంతో పోలీసులని నిలువరించే ప్రయత్నం చేశారు.

ఈ నేపధ్యంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయితే పోలీసు ఆంక్షలని దాటుకొని పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube