తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం.. ?

దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం చెప్పుకోలేని రీతిలో కొనసాగుతుంది.ఈ వైరస్ సోకడం ఒకవైపు అయితే కరోనా పేషంట్స్ బ్రతకడానికి చేస్తున్న జీవనపోరాటం ముందు కష్టాలు, దయ అనేది లేకుండా కాచుకు కూర్చున్నాయి.

 Tension-at Tirupati  Rua Hospital Tirupati, Rua Hospital, 13 Corona Patients, Cr-TeluguStop.com

కరోనాతో మృత్యు అంచులకు వెళ్లిన వారు బ్రతకాలనే ఆరాటంలో చేస్తున్న పోరాటంలో పరిస్దితులు అనుకూలించక అసువులు బాస్తున్న తీరు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టిస్తుంది.

ఇక కొన ఊపిరితో పోరాడుతున్న వారికి ఆక్సిజన్ ఎంత విలువైందో అందరికి తెలిసిందే.

ప్రస్తుత పరిస్దితుల్లో సమయానికి ఆక్సిజన్ అందకుంటే ఆ బ్రతుక్కి అర్ధమే మారిపోతుంది.ఇకపోతే తిరుపతి రుయా ఆసుపత్రిలో అత్యంత దయనీయ పరిస్దితులు నెలకొన్నాయట.

ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో ఐసీయూ వార్డులో దాదాపు 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగి, వార్డులో వస్తువులు ధ్వంసం చేశారట.

ఇదిలా ఉండగా చెన్నై నుంచి ఆక్సిజన్ ఆలస్యంగా రావడం వల్లే ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు రుయా ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube