Mallareddy University : మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ( Mallareddy University ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వర్సిటీలోని వసతి గృహంలో నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ స్టూడెంట్స్ రోడ్డెక్కి నిరసనకు దిగారు.దీనిపై వసతిగృహం ఇంఛార్జ్ మహేందర్ రెడ్డి ( Mahender Reddy )సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.

రోడ్డుపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకుని నిరసన చేపట్టడంతో వాహనాలు భారీగా స్తంభించాయి.రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను నచ్చజెప్పి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు