వైసీపీ వరుస విజయాలపై పార్టీ నేతల్లో టెన్షన్ ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తిరిగే లేదు అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి .2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ తన సత్తా చాటుతోంది ఈమధ్య జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే విధమైన ఫలితాలను దక్కించుకుంది.దాదాపుగా రాజకీయ శత్రువులు ఎవరు దరిదాపుల్లోకి రాలేనంత  స్థాయిలో వైసీపీకి ఫలితాలు దక్కాయి.ఇప్పుడు పరిషత్ ఎన్నికలలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.అలాగే తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే రిపోర్టులు వస్తుండడంతో జగన్ చాలా ఖుషీగా ఉన్నారు.అయితే పార్టీకి వరుసగా ఈ విధమైన సానుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం పై సొంత పార్టీ నాయకుల్లో ఆందోళన కలుగుతోంది.

 Ycp Party Leaders Troubled With Party Series Of Victories , Jagan, Ysrcp, Ap, Td-TeluguStop.com

ఇప్పటికే ప్రజల అంశాన్ని జగన్ ఎక్కువగా పట్టించుకుంటున్నారు అని,  పార్టీ నాయకులను పెద్దగా పట్టించుకోవడం లేదని చాలాకాలం నుంచి అసంతృప్తిగానే పార్టీ నాయకులు ఉంటూ వస్తున్నారు.ఇప్పుడు  వైసీపీకి తిరుగు లేదనే విషయం బయటపడడంతో,  జగన్ ఏ మాత్రం పార్టీ నాయకులను పట్టించుకోరు అనే ఆందోళన కలుగుతోంది.

అలాగే మంత్రి వర్గ ప్రక్షాళన సైతం చే పడతారని , ఇందులో ఎవరెవరు స్థానాలకు ముప్పు ఏర్పడుతుంది ? మరెవరికి ఇబ్బందులు వచ్చిపడతాయి అనే టెన్షన్ మంత్రుల్లోనూ నెలకొందట.

Telugu Chandrababu, Jagan, Panchayat, Ycp, Ysrcp-Telugu Political News

  ఇక ఎన్నికల తంతు పూర్తిగా ముగిసిన తర్వాత , నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టి , పూర్తి స్థాయి లో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు జగన్ వేయబోతున్నారట.అంతే కాదు తరుచుగా గ్రూపు రాజకీయాలకు కారణమవుతున్న నాయకులను పిలిచి మరీ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు,  ఒక గ్రూపును పూర్తిగా వదిలించుకునే ఆలోచనలో జగన్ ఉన్నారట.ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

జగన్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో , ముందు ముందు క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కంగారు పార్టీ నాయకుల్లో నేలకొందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube