టీఆర్ఎస్ లో పదవుల సందడి ! ఎమ్మెల్యే ఎంపీలకు కొత్త టెన్షన్ ?

టిఆర్ఎస్ ఎప్పటి నుంచో భర్తీ కాకుండా ఉన్న పార్టీ పదవుల విషయంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.పెద్దఎత్తున నామినేటెడ్ పదవుల తో పాటు, పార్టీ పదవుల భర్తీ చేపడితే నాయకుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, పదవులు పొందిన వారు పార్టీ కోసం మరింతగా కష్టపడతారు అనే అభిప్రాయంతో చాలాకాలం నుంచి వాయిదాలు వేసుకొంటూ వస్తున్నా, ఇప్పుడు ఈ పదవులు భర్తీని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

 Trs, Telangana, Kcr, Ktr, Trs Party Committee, Trs Mla's, Trs Mps, Trs Ministers-TeluguStop.com

తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.తెలంగాణలో మొదట పది జిల్లాలు ఉండేవి.

అయితే పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 కు చేరుకుంది.

అయినా ఆ పది జిల్లాల అధ్యక్షుల తోనే ఇప్పటివరకు నెట్టుకొస్తున్నారు.దీనివల్ల పార్టీ ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం సాధ్యం కావడం లేదనే ఉద్దేశంతో జిల్లా అధ్యక్ష పదవుల నియామకం చేపట్టబోతున్నారు.

అయితే ఈ నియామకాల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు టెన్షన్ పడుతున్నారట.

 కెసిఆర్ ఈ నియామకాలకు సంబంధించి ఏ అంశాలను ప్రాథమిక అర్హతగా తీసుకుంటారు అనేది తెలియకపోవడంతో కాస్త కంగారు కు గురవుతున్నారు.

వేరే ఎవరినైనా అధ్యక్షులుగా నియమిస్తే తమ ప్రభావం తగ్గుతుందని , ఆ పదవులలో తమ అనుచరులను నియమించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.తమ అనుచరులు కాకుండా వేరెవరైనా పార్టీ అధ్యక్ష పదవి లో కూర్చుంటే రాబోయే రోజుల్లో తమకు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు చూస్తే చేసే అప్పుడే పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టారు.సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు, 12 నుంచి 20 వరకు మండల పట్టణ కమిటీలను, 20వ తేదీ నుంచి జిల్లా కమిటీలను ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు.

Telugu Telangana, Telangana Cm, Trs Ministers, Trs Mlas, Trs Mps, Trs Committee-

ఈ నెలలోనే రాష్ట్ర స్థాయి నుంచి,  గ్రామ స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించాలని కేసీఆర్ డిసైడ్ అవ్వడంతో టిఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.అయితే జిల్లాలో కేవలం మూడు నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉండడంతో,  స్థానిక ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటి వరకు తాము చెప్పినట్లుగానే జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నడిచాయని, కొత్తవారు వస్తే తమ హవాకు గండి పడుతుందని టెన్షన్ పడుతున్నారట.నామినేటెడ్ పదవులతో పాటు,  జిల్లా అధ్యక్ష పదవులను తమ అనుచరులకు ఇప్పించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube