కామన్వెల్త్ గేమ్స్‌ నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు మిస్సింగ్.. కారణం తెలిస్తే..?

2022 కామన్వెల్త్ గేమ్స్‌ ప్రస్తుతం యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ గేమ్స్‌లో పాటిస్పేట్ చేయడానికి వెళ్ళిన శ్రీలంక దేశ క్రీడాకారుల బృందంలోని పది మంది సభ్యులు మిస్ అయ్యారు.

 Tens Of Athletes Are Missing From The Commonwealth Games. Common Wealth Games, S-TeluguStop.com

వీరందరూ కూడా తమ ఈవెంట్స్ ని పూర్తి చేసుకున్న తర్వాత అదృశ్యమయ్యారు.దీంతో శ్రీలంక ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు.

మిస్ అయిన వారందరూ కూడా బ్రిటన్‌లో ఉండాలని కోరుకుంటున్నారని, అందుకే వారందరూ మిస్ అయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అదృశ్యమైన వారిలో తొమ్మిది మంది క్రీడాకారులు ఉండగా, ఒక మేనేజర్ కూడా ఉన్నారు.

వీరు తమ ఈవెంట్‌లను ఫినిష్ చేసి ఆపై కనిపించకుండా వెళ్లిపోయారని ఒక ఉన్నత క్రీడా అధికారి వెల్లడించారు.

మిస్సయిన వారిలో జూడోకా చమీలా దిలానీ, ఆమె మేనేజర్ అసేలా డి సిల్వా, రెజ్లర్ షానిత్ చతురంగ అనే ముగ్గురు గత వారం అదృశ్యమయ్యారు.

ఆ తర్వాత మరో ఏడుగురు కూడా అలానే మిస్ అయ్యారు.శ్రీలంకలో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతోంది కాబట్టి మళ్లీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టంలేక వారు యూకేలోనే ఉండిపోవాలని ఆలోచిస్తున్నారేమోనని, ఇక్కడే ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారేమోనని ఒక అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Commonwealth, Teams-Latest News - Telugu

సాధారణంగా క్రీడాకారులతో పాటు వారి కోచ్‌లు, మేనేజర్లందరూ స్వదేశానికి తిరిగి వచ్చారని నిర్ధారించుకోవడానికి శ్రీలంక కంటెంజెంట్ మేనేజ్‌మెంట్ సభ్యులందరి పాస్‌పోర్ట్‌లను దగ్గరే ఉంచుకుంటుంది.అయినా కూడా కొందరు పాస్‌పోర్ట్‌లు తమ దగ్గర లేకపోయినా యూకేలోకి పారిపోయారు.స్థానిక నివేదిక ప్రకారం, బ్రిటీష్ పోలీసులు మొదటగా మిస్సయిన ముగ్గురు సభ్యులను కనిపెట్టారు.కానీ వారిపై ఏ చర్య తీసుకోలేదు.ఎందుకంటే ముగ్గురికి ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నాయి.వీరి పాస్‌పోర్ట్‌లను తిరిగి ఇవ్వమని పోలీసులు కంటెంజెంట్ మేనేజ్‌మెంట్ ని కోరినట్లు ఒక అధికారి పేర్కొన్నారు.

వారి పాస్‌పోర్ట్‌లను తీసుకున్న తర్వాత వారు ఎక్కడున్నారు అనేది మాత్రం అధికారులకు పోలీసులు చెప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube