'పబ్‌జి'ని దేశ భక్తి గేమ్‌గా మార్చేసిన చైనా... వాళ్ల తెలివికి సెల్యూట్‌  

Tencent Replaces Hit Mobile Game Pubg With A Chinese Govt-chinese Govt,replaces Pubg Game,tencent,పబ్‌జి గేమ్‌

గత ఏడాది యువతను షేక్‌ చేసిన గేమ్‌ పబ్‌జి. ఇంకా కూడా జనాలు పబ్‌జి మోజులోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పబ్‌జి గేమ్‌ వల్ల దాదాపుగా వంద మందికి పైగా చనిపోయి ఉంటారనే టాక్‌ ఉంది..

'పబ్‌జి'ని దేశ భక్తి గేమ్‌గా మార్చేసిన చైనా... వాళ్ల తెలివికి సెల్యూట్‌-Tencent Replaces Hit Mobile Game PUBG With A Chinese Govt

ఒక్కసారి గేమ్‌ ఆడితే మళ్లీ మళ్లీ ఆడాలనిపించే విధంగా అందులో ఉంటుంది. గేమ్‌లో లెవల్స్‌ చాలా కఠినంగా ఉండటంతో చాలా శ్రధ్ద పెట్టి మరీ ఆడాల్సి ఉంటుంది. ఎంతో మంది చదువులు మానేసి, ఉద్యోగాలు కూడా పక్కకు పెట్టి పబ్‌జి ఆడుతున్నట్లుగా మనం వార్తల్లో చూశాం.

ఇక పబ్‌జి ఆడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య లెక్కలేదు. అలాంటి పబ్‌జి గేమ్‌ ను ఇండియాలో బ్యాన్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ వ్యక్తం అవుతుంది. అయితే ఇండియన్‌ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక చైనా మాత్రం చాలా విభిన్నంగా ఆలోచించింది.

పబ్‌జి గేమ్‌ కనిపెట్టింది దక్షిణ కొరియావారు అయినా కూడా దానికి సంబంధించిన రైట్స్‌ అన్ని కూడా చైనా కంపెనీకి ఉన్నాయి. దాంతో పబ్‌జి గేమ్‌ను తమ దేశంలో మాత్రం చెడు ప్రభావం లేకుండా చేశారు.

పబ్‌జి గేమ్‌కు అక్కడ కూడా యువత బానిస అయ్యి చెడు మార్గంలో పయణిస్తున్న నేపథ్యంలో అక్కడి ఉన్నతాధికారులు చేసేది లేక పబ్‌జిని బ్యాన్‌ చేయాలనుకున్నారు. అయితే ఇదే సమయంలో పబ్‌జికి బదులుగా అలాంటి తరహా గేమ్‌తో జనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. పబ్‌జి గేమ్‌ కొత్త వర్షన్‌ ను చైనా విడుదల చేసింది.

పబ్‌జి గేమ్‌లో ఉండే పాత్రలు, అందులో ఉండే సీన్స్‌తో కొత్త గేమ్‌ ఒకటి తయారు చేశారు. అయితే ఈ గేమ్‌లో హింస లేకుండా చైనా పై దేశ భక్తి కలిగేలా చేశారు. ఎన్నో అద్బుతమైన పాత్రలతో గేమ్‌ను ఆసక్తికరంగా మార్చి, సోషల్‌ కార్యక్రమాలు, ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే పాయింట్లు వచ్చేలా గేమ్‌ను తయారు చేయడం జరిగింది. ఒకరికి సాయం చేయడం వల్ల పాయింట్లు రావడం అనేది ఒక మంచి ఆలోచన, దీని వల్ల యువతలో మంచి గుణం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పక్క దేశం మాదిరిగా ఇండియాలో కూడా ఇలాంటి ప్రయోగం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.