రివ్యూ : 'తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్‌'తో అయినా సందీప్‌ సక్సెస్‌ కొట్టాడా, రేటింగ్‌ ఎంత  

Tenali Ramakrishna Ba Bl Movie Review And Rating-sundeep Kishan,tenali Ramakrishna Ba Bl Collections,tenali Ramakrishna Ba Bl Review,tenali Ramakrishna Ba Bl Talk

కెరీర్‌ ఆరంభంలో కొన్ని సక్సెస్‌లతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్‌ కిషన్‌ గత కొంత కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు.అవకాశాలు లేకపోవడంతో సొంతంగా కూడా బ్యానర్‌ స్థాపించి తన సినిమాలను తానే నిర్మించుకున్నాడు.ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ చిత్రం అయినా సందీప్‌ కిషన్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Tenali Ramakrishna Ba Bl Movie Review And Rating-sundeep Kishan,tenali Ramakrishna Ba Bl Collections,tenali Ramakrishna Ba Bl Review,tenali Ramakrishna Ba Bl Talk- Movie Reviews-Tenali Ramakrishna BA BL Movie Review And Rating-Sundeep Kishan Tenali Ba Bl Collections Talk

ఆయనకు ఈ చిత్రం సక్సెస్‌ తెచ్చి పెట్టలేక పోతే కెరీర్‌ ఏమవుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

లా పూర్తి చేసిన తెనాలి రామకృష్ణ(సందీప్‌ కిషన్‌) కేసులు లేక వెలవెల బోతూ ఉంటాడు.ఎదోలా కేసులు తెచ్చుకుని వాటిని రాజీ కుదుర్చుతూ ఉంటాడు.

కేసులను రాజీ కుదర్చడంలో ఈయనకు ఈయనే సాటి అంటూ పేరు తెచ్చుకున్నాడు.అలాంటి రామకృష్ణకు వరలక్ష్మి కేసు ఒకటి తలుగుతుంది.ఆ కేసుతో రామకృష్ణ జీవితం మొత్తం తలకిందులు అవుతుంది.కామెడీగా సాగిపోయే రామకృష్ణ లా కెరీర్‌ సీరియస్‌ టర్న్‌ తీసుకుంటుంది.

ఇంతకు రామకృష్ణ ఎదుర్కొన్న సమయ్యలు ఏంటీ వాటి నుండి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన : హన్సిక హీరోయిన్‌గా చాలా కాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ చిత్రంతో హన్సిక మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలనుకుంది.కాని అంతంత మాత్రంగానే ఆమె ఆకట్టుకుంది.సినిమాలో చాలా మంది కమెడియన్స్‌ ఉన్నారు.

వారు కొన్ని సీన్స్‌లో నవ్వు తెప్పించేలా నటించారు.మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి ఓకే అనిపించారు.

టెక్నికల్‌ :

సాయి కార్తీక్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.ఇది ఆయనకు 75వ చిత్రం అవ్వడం వల్ల చాలా మంది అంచనాలు పెట్టుకున్నారు.కాని అంచనాలకు తగ్గట్లుగా పాటలు మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేదు.

ఆయన గత సినిమాల మాదిరిగానే సాదా సీదాగానే పాటలు ఉన్నాయి.దర్శకుడు శ్రీనివాసరెడ్డి చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు.కాని స్క్రీన్‌ప్లే నడపడంలో విఫలం అయ్యాడు.చాలా రొటీన్‌ స్క్రీన్‌ప్లేతో బోర్‌ కొట్టించాడు.

కొన్ని కామెడీ సీన్స్‌ మినహా ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు.సినిమాటోగ్రఫీ కథనుసారంగా ఉండి పర్వాలేదు అనిపించింది.ఇక ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి.పలు సీన్స్‌ సాగతీసినట్లుగా ఉన్నాయి.

వాటిని ఇంకా చాలా కట్‌ చేసినా పోయేది ఏమీ లేదు.నిర్మాణాత్మక విలువలు కూడా సో సో గానే ఉన్నాయి.

విశ్లేషణ :

ఇలాంటి కథలతో గతంలోనే సినిమాలు వచ్చాయి.అయితే ఈసారి కాస్త విభిన్నంగా దర్శకుడు నాగేశ్వరరెడ్డి తీసే ప్రయత్నం చేశాడు.

కాని విఫలం అయ్యాడు.ఎంటర్‌టైన్‌ మెంట్‌ పర్వాలేదు అనిపించినా ఇతర సన్నివేశాలు ఏమీ కూడా ప్రేక్షకులను కట్టి పడేయడంలో సక్సెస్‌ కాలేదు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.సందీప్‌ కిషన్‌కు ఈ చిత్రం కూడా కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు.

అయితే కొన్ని కామెడీ సీన్స్‌ కారణంగా సినిమా స్థాయి పెరిగిందని చెప్పుకోవచ్చు.ఆ కొన్ని సీన్స్‌ కూడా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.!

ప్లస్‌ పాయింట్స్‌ :

కొన్ని కామెడీ సీన్స్‌

హన్సిక గ్లామర్‌

మైనస్‌ పాయింట్స్‌:

కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌

బోటమ్‌ లైన్‌ :

ఓ మోస్తరు ఎంటర్‌టైనర్‌.