ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టించిన పదేళ్ల బాలుడు... ఏం చేసాడంటే?

కరోనా అనేది ఎంతో మంది జీవితాలను దుర్బరంగా మార్చేసింది.ఒకప్పుడు మధ్యతరగతి జీవితం ఉన్న వారు ఇప్పుడు కరోనా పరిస్థితులలో ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఉంది.

 Ten Year Old Boy Who Enchanted The Chief Minister What Did He-TeluguStop.com

ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి సాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి ఉంది.ఇక అలాంటి పరిస్థితులలో ఉన్న కుటుంబాలు ఇక భిక్షాటన తమ వృత్తిగా ఎంచుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, సినిమా హాల్స్ దగ్గర పిల్లలను ఉంచి అలా వచ్చిన రోజూ వారి డబ్బుతో తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు.

మనం చదువుతుంటేనే ఎంతో హృదయ విదారకంగా అనిపిస్తోంది.అయితే తాజాగా పంజాబ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ పదేళ్ల కుర్రాడు సాక్సులు అమ్ముతూ రోజూ వారీ జీవనం గడుపుతున్న ఓ చిన్న కుర్రాడి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 Ten Year Old Boy Who Enchanted The Chief Minister What Did He-ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టించిన పదేళ్ల బాలుడు… ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

,/br>

అయితే ఈ చిన్నారి దగ్గర సాక్సులు కొనుక్కోవాలని వెళ్లిన వ్యక్తి చిన్నారికి జాలితో డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించాడు.కాని ఆ చిన్నారి డబ్బును సున్నితంగా తిరస్కరించాడు.

ఇక ఆ చిన్నారి నిజాయితీని చూసి నెటిజన్లు ముగ్దలయ్యారని చెప్పవచ్చు.ఇక ఈ వీడియో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇక ఈ చిన్నారి వీడియో విషయం పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ దృష్టికి వచ్చింది.వెంటనే ఆ చిన్నారితో మాట్లాడిన సీఎం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.

తిరిగి చదువును కొనసాగించమని చిన్నారికి సూచించాడు.మీ అమ్మా, నాన్నల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానని చిన్నారికి భరోసా ఇచ్చారు సీఎం అమరేందర్ సింగ్ఈ వీడియో ఇక ప్రతిపక్షాలకు అదునుగా మారింది.

మీ పాలనలో చిన్నారుల జీవితాలు ఇవి అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.ఇక నెటిజన్లు మాత్రం సీఎం అమరేందర్ సింగ్ ను అభినందిస్తున్నారు.

#Viral Video #ViralVideo #PunjabCM

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు