ఐపీఎల్ 2022లో పది జట్లు ఖాయం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో పది జట్లు ఉంటాయని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ తెలిపారు.ఇక యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు స్టేడియంలోకి ప్రేక్షకులు ప్రవేశానికి అనుమతి ఇవ్వడంపై ఆదేశంలో చర్చిస్తున్నట్లు అయన పేర్కొన్నారు.

 Ten Teams Confirmed In Ipl 2022.  Ipl 2022 , Starts Sept 19 , Ten Teams Conforme-TeluguStop.com

ఇకపోతే ఎనిమిది జట్లు లీగ్ ఆడటం ఇదే చివరిసారని ఆయన స్పష్టం చేశారు.వచ్చే సీజన్ నుంచి పది జట్లు పోటీలో ఉంటాయని వెల్లడించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నాం ప్రజలు టీకాలు వేయించుకోవడం వల్ల యూఏఈ ప్రభుత్వం అనుమతిఇస్తుందని ఆశిస్తున్నాం.

ఏం జరుగుతుందో చూడాలి ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లుకి, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం.మిగతా వ్యవహారమంతా యూఏఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని ధూమల్ అన్నారు.యూఏఈ లోఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతం అవుతుందని  నమ్ముతున్నామన్నారు.2011లో 10 జట్లతో ఐపీఎల్ నిర్వహించగా2012, 2013లో 9 జట్లు కొనసాగాయి.ఆ తర్వాత నుంచి మళ్ళీ 8 జట్లుకే పరిమితి అయ్యాయి.ఈ ఏడాది డిసెంబర్ లో ఆటగాళ్ల భారీ వేలం ఉండొచ్చని సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube