రోడ్డు ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం.. బ‌స్సులో చిక్కుకున్న‌వారిని ఎలా తీస్తున్నారంటే..

జార్ఖండ్‌లోని పాకూర్‌లో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు.లిట్టిపాడు-అమడపర ప్రధాన రహదారిపై పాడేర్‌కోల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

 Ten Died In Jharkhand Bus Accident Details, Jharkhand State, Pakur Arean Cylinde-TeluguStop.com

మీడియా కథనాల ప్రకారం, బస్సు పాకూర్ నుండి దుమ్కాకు వెళుతోంది.బ‌స్సులో 40 మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది గాయపడ్డారు.బస్సు బాడీని క‌ట్ చేసి బాధితుల‌ను బయటకు తీస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.కృష్ణ రజత్ బస్సు, ఎల్‌పిజి సిలిండర్ నింపిన ట్రక్కు ప‌ర‌స్ప‌రం బలంగా ఢీకొన్నాయని చెబుతున్నారు.

సిలిండ‌ర్ల‌తో కూడిన లారీ.బస్సును ఢీకొట్టింది.

దీంతో రెండు వాహనాలూ ధ్వంసమయ్యాయి.ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా కలకలం చెల‌రేగింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో ఉన్న 10 మంది మృతి చెందారు.కాగా పదుల సంఖ్యలో ప్ర‌యాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి త‌ర‌లించారు.జిల్లా యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకుంది.

సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు.మృతులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.ఘ‌ట‌న‌పై స్పందించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రమాద స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని సీనియర్ అధికారులను ఆదేశించారు.మృతులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube