ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. ఆసుపత్రి బిల్లు తెలిస్తే గుండే ఆగాల్సిందే..!

Ten Crores Hospital Bill For Mali Woman Haleema Who Gave Birth To 9 Babies Details

ఒకేకాన్పులో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన 25 ఏళ్ల హలీమా సిస్సే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ తల్లి గురించి అప్పట్లో ప్రపంచనలుమూలలా అనేక కథనాలు వెల్లువెత్తాయి.

 Ten Crores Hospital Bill For Mali Woman Haleema Who Gave Birth To 9 Babies Details-TeluguStop.com

ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.మరికొందరు మాత్రం ఆమె అంత మంది పిల్లలను ఒకేసారి ఎలా పెంచుతుందో ఏమో అని కాస్త కలవరపడ్డారు.

పాపం ఈ తల్లి ఇప్పుడు నిజంగానే తన తొమ్మిది మంది పిల్లలను పోషించేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.హలీమా ప్రసవ సమయంలోనే హాస్పిటల్ బిల్లు రూ.10 కోట్ల రూపాయలు అయింది.అప్పట్లో ఆమె మాలి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో ఆసుపత్రి బిల్లును చెల్లించింది.

 Ten Crores Hospital Bill For Mali Woman Haleema Who Gave Birth To 9 Babies Details-ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. ఆసుపత్రి బిల్లు తెలిస్తే గుండే ఆగాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ 9 మంది కంటే ముందుగా ఆమె మరో బిడ్డకు కూడా జన్మించింది.దీంతో ఇప్పుడామె మొత్తం 10 మంది పిల్లలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.మాలి దేశానికి చెందిన కాదర్, హలీమా దంపతులకు ఒక ఆడపిల్ల ఉంది.

రెండవ ప్రెగ్నెన్సీలో హలీమా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది.అయితే తొమ్మిది మందిని పిల్లలను నవమాసాలు మోయలేక ఆమె చాలా ఇబ్బంది పడిందట.

దీంతో చేసేదేమీ లేక హలీమాకు డాక్టర్లు సిజేరియన్ చేసి పిల్లలను ఈ ప్రపంచంలోకి సురక్షితంగా తీసుకు వచ్చారు.వీరిలో నలుగురు మగపిల్లలు ఉంటే.

ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.

అయితే తొమ్మిది నెలల ముందే తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి పుట్టడంతో వారి ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది.

Telugu 10 Litres Milk, 100 Diapers, 9 Babies, Birth To 9 Babies Details, Born, Docters, Khadar And Halima, Mali Government, Mali Woman Haleema, Social Media, Ten Crores Hospital Bill, Viral Latest, Viral News-Latest News - Telugu

దీంతో డాక్టర్లు ఆ బిడ్డలను ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందించారు.కొద్దిరోజుల తర్వాత హలీమా డిశార్జ్ అయ్యే సమయానికి డాక్టర్లు భారీ బిల్లు వేశారు.మన డబ్బుల్లో ఆ బిల్లు ఖర్చు అక్షరాల పదిన్నర కోట్ల రూపాయలు. ఇంత పెద్ద బిల్లు చూసి ఆ దంపతులు దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న మాలి ప్రభుత్వం దాదాపు బిల్లు మొత్తాన్ని చెల్లించగా మిగిలిన బిల్లు చెల్లించడానికి ఆ దంపతులు తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది.

Telugu 10 Litres Milk, 100 Diapers, 9 Babies, Birth To 9 Babies Details, Born, Docters, Khadar And Halima, Mali Government, Mali Woman Haleema, Social Media, Ten Crores Hospital Bill, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ గండం గట్టెక్కిన తర్వాత ఇక పిల్లల పోషణ పెను సవాలుగా మారింది.పిల్లందరికీ పాలివ్వాలంటే ప్రతిరోజూ ఆమె 6 లీటర్ల పాలు ఇవ్వాల్సి వస్తోంది.అలాగే ప్రతిరోజూ వారికి 100 డైపర్లు అవసరం అవుతున్నాయి.

ప్రస్తుతం వైద్యులు పిల్లల ఆరోగ్య విషయమై సహాయం అందిస్తున్నారని ఆమె ఇటీవల మీడియాకు వెల్లడించింది.పిల్లలు పెరిగి కాస్త పెద్దయిన తర్వాత మాలి ప్రభుత్వం కనీస అవసరాల కోసం ఆర్థిక సాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.

మరి మాలి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తుందో లేదో చూడాలి.

#Mali Haleema #Docters #Bill #Khadar Halima #Mali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube