మన 100 రూపాయలు ఆ దేశం లో 60,000 , మన రూపాయి విలువ ఎక్కువ ఉన్న దేశాలు ఏంటో తెలుసా  

Ten Countries You Can Visit Where The Indian Rupee Is Stronger!-indian Rupee Is Stronger,lavo Kingdom,paraguay,sierra Leone

మన చుట్టలో మన స్నేహితులో విదేశాలకు వెళితే అక్కడ డాలర్స్ సంపాదించుకొని ఇక్కడి వస్తే ధనవంతులు అయిపోయినట్లే అనుకుంటారు ఎందుకంటే మన దేశ కరెన్సీ విలువ తక్కువ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ యు కె దేశాల కరెన్సీ లు మన దానితో పోల్చుకుంటే 50 రేట్ల కన్నా ఎక్కువే. ప్రస్తుతం అమెరికా డాలర్ తో పోల్చుకుంటే మన రూపాయి విలువ 70 అంటే 1 డాలర్ కి 70 రూపాయలు అన్నమాట..

మన 100 రూపాయలు ఆ దేశం లో 60,000 , మన రూపాయి విలువ ఎక్కువ ఉన్న దేశాలు ఏంటో తెలుసా-Ten Countries You Can Visit Where The Indian Rupee Is Stronger!

మన దేశ కరెన్సీ విలువ ఎక్కువ ఉన్న దేశాలు ఏంటో చూడండి

10.కంబోడియా రియల్

దక్షిణ తూర్పు ఆసియా దేశం అయిన కంబోడియా కరెన్సీ పేరు రియల్ , ఇక్కడ ప్రజలు మార్చుకునే కంబోడియా కరెన్సీ అయిన రియల్ విలువ మన రూపాయి కన్నా తక్కువే. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 58 రూపాయలు. అంటే మన 100 రూపాయలు ఇక్కడ కరెన్సీ 5800 తో సమానం..

9. పరుగ్వే గురని

సౌత్ అమెరికా లో రెండవ బీద దేశం పరుగ్వే ఇక్కడి కరెన్సీ పెరు గురని , ఈ దేశ కరెన్సీ మన దేశం యొక్క రూపాయి తో పోల్చినపుడు చాలా తక్కువ. మన ఒక్క రూపాయి పరుగ్వే 87 గురనిలకు సమానం.మన 100 రూపాయలు పరుగ్వే 8700 గురనిలకు సమానం.

8. ఉజ్బెకిస్తాన్ సోమ్

ఆసియా దేశాలలో ఒకటైన ఉజ్బెకిస్తాన్ లో కరెన్సీ ని సోమ్ అంటారు.

మన దేశ రూపాయి తో పోల్చినపుడు ఉజ్బెకిస్తాన్ సోమ్ విలువ తక్కువ. మన ఒక రూపాయి అక్కడి 120 సోమ్ లకి సమానం. మన 100 రూపాయలు అక్కడ 12000 సోమ్ ల విలువ.

7. లాఓస్ లాఓ కిప్

చైనా దేశాన్ని అనుకోని ఉన్న లాఓస్ అనే దేశ కరెన్సీ ని లాఓ కిప్ అంటారు , మన రూపాయి ఇక్క 124 లాఓ కిప్ లకి సమానం..

6.సియర్రా లియోన్

ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్ కరెన్సీ లియోన్స్ ,ఇక్కడ కరెన్సీ తో పోల్చినపుడు మన రూపాయి విలువ ఎక్కువ మన 1రూపాయి విలువ ఈ దేశం లో 125 లియోన్స్ తో సమానం..

5. గిని గినియన్ ఫ్రాంక్

గిని ఆఫ్రికా లోని ఒక దేశం ఇక్కడ బంగారం , ఆయిల్ ఇంకా చాలా వనరులు కల దేశం కానీ ఇక్కడ ద్రవ్యోల్బణం కరంగా ఈ దేశ కరెన్సీ పడిపోయింది. మన ఒక్క రూపాయి 130 గినియన్ ఫ్రాంక్ లకి సమానం..

4. ఇండోనేషియా రూపాయి

ఇండోనేషియా ప్రపంచం లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం , ఆసియా లొనే జనాభా లో ఒక పెద్ద దేశం , ఈ దేశ కరెన్సీ ని ఇండోనేషియా రూపాయి అంటారు , మన ఒక రూపాయి ఇక్కడ 205 ఇండోనేషియా రూపాయిలకి సమానము..

3. సావ్ టోమే అండ్ ప్రిన్సిపే డోబ్రా

సావ్ టోమే అండ్ ప్రిన్సిపే ఈస్ట్ ఆఫ్రికా లో ఒక దీవి..

ఇక్కడ కరెన్సీ ని డోబ్రా అంటారు. మన దేశ రూపాయి ఇక్కడ 308 డోబ్రా లతో సమానం. అంటే మన 100 రూపాయలు ఇక్క 30,800 డోబ్రా లకి సమానం.

2.వియత్నాం డాంగ్

దక్షిణ తూర్పు ఆసియా లోని దేశం వియత్నాం ఇక్కడ కరెన్సీ ని డాంగ్ అంటాడు. మన రూపాయి ఇక్కడ 333 రూపాయలతో సమానం. మన 100 రూపాయలు వియత్నం లో33,300 డాంగ్ లతో సమానం.

1.ఇరానియన్ రియాల్

.

ప్రపంచం లొనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఇరానియాన్ రియాల్ ,ఇది ఇరాన్ యొక్క కరెన్సీ.

మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 605 ఇరానియన్ రియాల్ తో సమానం. మన 100 రూపాయలు ఇరాన్ లో 60,500 రియాల్ లతో సమానం.