కరోనా కాలంలో దేశంలో నేటి నుంచి ఆలయాల దర్శనాలు షురూ ...!

దేశంలో కరోనా వైరస్ నివారణ కోసం ప్రస్తుతం ఐదవ సారి లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి అన్ లాక్ విధానం మొదలవడంతో దేశంలోని ఆలయాలు ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి.

 Temples Open In The Country From The Time Of The Corona,temples,corona Virus,sho-TeluguStop.com

ఇక మన తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ఆలయాలను, మాల్స్ అన్నీ కూడా తెరుచుకోవడం జరిగింది.ఇక ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఈ రోజు నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.

నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మొత్తం పూలమాలలతో పుష్పాలతో అలంకరించి చేయడం జరిగింది.

ఇక కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన ఈ విధంగా గంటకు 500 మందికి దర్శన భాగ్యం కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అలాగే రోజుకు ఆరు వేల మందిని సాయంత్రం 6 గంటల వరకు అనుమతించినట్లు టిటిడి అధికారులు తెలియజేశారు.ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు.

అంతేకాకుండా నేడు రేపు టిటిడి ఉద్యోగులు స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శన భాగ్యం కలిగించునట్లు ఆలయ ఈవో తెలియజేయడం జరిగింది.

ఇకపోతే దేశం మొత్తం మీద అనేక కఠిన ఆంక్షలతో కూడిన సడలింపు లను దేవాలయాలకు, మాల్స్ కు ఇంకా అనేక వాటికి ఇవ్వడంతో దేశం నలుమూలల ఆలయాలు తెరుచుకున్నాయి.

ఇకపోతే గుడిలో కంపల్సరిగా గా సామాజిక దూరాన్ని పాటిస్తూ దేవుని దర్శించుకుని ఈ విధంగా ఆలయ సంఘాలు చర్యలు తీసుకుంటున్నాయి.ఏది ఏమైనా ఒక దేశంలో ఒకవైపు కరుణ విజృంభిస్తుంటే మరోవైపు ఇలా సడలింపు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వానికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube