మన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆ ఆలయం ఏర్పడడం వెనకున్న కథ ఇదే.! ఆ రాణికి రుతుచక్రం రావడంతో.!     2018-10-12   11:42:37  IST  Sainath G

ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు. నరేంద్రమోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పింది ఆ గుడిలోనే దేవతే అంట. మన సమస్యలకు సమాధానం చెప్పే దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి ఆలయం కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో నెలకొంది. ఆ ఆలయం ఎరపడడం వెనక ఒక ఆసక్తికర కథ ఉంది. అదేంటి అంటే.?

వందల ఏళ్ల క్రితం కర్నాటకలోని రాయచూరు జిల్లాలో తుంగా నదీ తీరంలో నంద అనే సామ్రాజ్యం ఉండేది. ఈ సామాజ్యాన్ని పరిపాలించే రాజు శక్తి దేవతలను పూజించేవాడు. దీంతో అనేక మంత్ర తంత్ర శక్తులు కూడా ఆ రాజుకు తెలిసి ఉండేవి. దీంతో తనకున్న మంత్ర శక్తితో ఎంతో దూరంలో ఉన్న కాశీకి తెల్లవారుజాము నాలుగు గంటలకే వెళ్లేవాడు. కానీ ఈ విషయాన్నీ ఆ రాజు భార్య నమ్మదు. అందుకే అతని వెంట కాశీకి వస్తా అంటుంది. దీంతో మరుసటి రోజు ఆ రాజు తన భార్యని అక్కడికి తీసుకెళ్తారు.

ఇలా ఇద్దరూ కాశీలో ఉన్నప్పుడు రాణికి రుతుచక్రం వస్తుంది. దీంతో రాజు తన మంత్ర శక్తులన్నీ కోల్పోతాడు. దీంతో గంగా నది ఒడ్డున కుర్చొని చింతిస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మణులు విషయాన్ని తెలుసుకొని చండీయాగం చేసి రాణిని పవిత్రురాలుని చేస్తారు. ఆ సమయంలో రాజు వారికి దానం, భూమి ఇస్తామని మాట ఇస్తారు. అయితే గతాన్ని మరిచిపోయినరాజు వారి కోర్కెను మన్నించక పోగా వారిని నిందిస్తాడు. దీంతో బ్రహ్మణులు కాశీలో తమ ఒప్పందానికి సాక్షిగా ఉన్న చౌడేశ్వరీ దేవిని నంద రాజ్యానికి రావాల్సిందిగా కోరుతారు. దీంతో చౌడేశ్వరీ దేవి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. దీంతో రాజుకు తన తప్పు తెలిసి వస్తుంది. అటు పై బ్రహ్మణులకు మాట ఇచ్చినట్లు భూమితో పాటు బంగారం, వెండి, ధాన్యం కూడా ఇస్తాడు. ఆపై అమ్మవారిని అక్కడే ఉండవలసిందిగా కోరుతారు. అలా ఆ ఆలయం ఏర్పడింది.?