చలి - పులి : తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న చలి

తెలంగాణలో చలి తన ప్రతాపం చూపిస్తుంది.మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది.40 శాతం అడవి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పులుల భయం ఎక్కువగా ఉంటుంది.ఇప్పుడు పులి తో పాటుగా చలి తోడవడంతో అడవి లో నివసించే గిరిజన వాసులు మరియు సమీప గ్రామీణ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు.

 Temperatures Falling In Adilabad, Temperatures , Telugu States, Hyderabad, Weath-TeluguStop.com

ఇప్పుడు ఆ జిల్లాలో ఎక్కడ చూసిన ఉదయం , సాయంత్రం చలి మంటల చుట్టూ ప్రజలు గుమ్మికుడుతున్నారు.గత నాలుగు అయిదు రోజుల నుండి అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

నాలుగు డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతంకు చెందిన ప్రజలు చలికి వణుకుతున్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 4.3 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా అర్లి(టి)లో 4.6 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే చలి ప్రభావం లేదు ఖమ్మం లోని చర్ల, భద్రాచలం లో కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉంది. చలి ప్రభావం ఒక్క గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎక్కువగా ఉంది.

ఉదయం 9 గంటలు అయిన చలి తగ్గడం లేదు.మొన్నటి వరకు వర్షాలకు చిగురుటాకుల వణికిన హైదరాబాద్ ఇప్పుడు చలికి వణుకుతుంది.తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి చలి గాలుల ప్రభావంతో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube