Temperatures dropped : రెండు తెలుగు రాష్ట్రాలలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!

మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వానలు కురుస్తూ వచ్చాయి.తెలంగాణలో అత్యధికంగా వర్షాలు పడుతూ ఉండటంతో అక్కడ అనేక మంది ప్రజలు అవస్థలు పడ్డారు.

 Temperatures Dropped In Two Telugu States Andhra Pradesh, Telangana , Temperatur-TeluguStop.com

కొంతమంది రైతులు కూడా పంట నష్టపోవడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొన్నటిదాకా తుఫానులు కురిసాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.

తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం జిల్లాలో.8° కనీస ఉష్ణోగ్రత నమోదయింది.సిద్దిపేట జిల్లా దూల్మెట్టలో 10.9, నారపల్లిలో.13, సంగారెడ్డి జిల్లా నల్లపల్లిలో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే.

అల్లూరి జిల్లా ఏజెన్సీ మినుములూరులో 10, పాడేరులో 12, అరకు లోయ12 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి.గుంటూరు, నరసరావు పేట పొగమంచు కారణంగా వాహనదారులు అనేక కష్టపడుతున్నారు.

దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు.చలికి వణికిపోతున్నారు.

ఈ క్రమంలో పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.అటవీ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగ మంచునీ పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube